ఇదే విడ్డూరం అంటే.. తనను తానే పెళ్లి చేసుకుంది.. ఇప్పుడు విడాకులు కూడా?
కానీ ఈ మధ్యకాలంలో మాత్రం కొంతమంది పెళ్లి విషయంలో ఆలోచిస్తున్న తీరు ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఎందుకంటే ఎంతోమంది అమ్మాయిలు హీరో లాంటి అబ్బాయిని పెళ్లి చేసుకోవడం కాదు తోటి అమ్మాయిలని పెళ్లి చేసుకుంటూ అందరికీ షాక్ ఇస్తున్నారు. ఇక కొంతమంది అబ్బాయిలు అబ్బాయిలను పెళ్లి చేసుకునేందుకు కూడా వెనకడుగు వేయడం లేదు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలాంటి పెళ్లిల్లే అందరిని ఆశ్చర్యపరుస్తుంటే.. ఇంకొంతమంది మాత్రం మరింత విడ్డూరంగా తమను తామే పెళ్లి చేసుకుంటున్నారు. ఇవన్నీ చూసి ఏంటో.. కలికాలం అంటే ఇదేనేమో అని ఇంటర్నెట్ జనాలు అందరూ అనుకుంటూ ఉన్నారు అని చెప్పాలి.
అయితే ఇలా తనను తాను పెళ్లి చేసుకోవడమే విడ్డూరం అంటే.. ఇక్కడ మరో వింతైన ఘటన జరిగింది. సాధారణంగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చినప్పుడు విడాకులు తీసుకోవడం చేస్తూ ఉంటారు. కానీ తనను తానే ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంటే.. విడాకులు తీసుకునేందుకు అవకాశం ఉంటుందా.. అసలు ఉండదు. కానీ ఇక్కడ మాత్రం మహిళ అలాగే విడాకులు తీసుకుంది. బ్రెజిల్ కు చెందిన మోడల్ సువెల్లిస్ కారీ అనే 36 ఏళ్ల మహిళ గత ఏడాది తనను తానే వివాహం చేసుకుంది. ఇక ప్రస్తుతం లండన్ లో ఉంటున్న ఈమె ఒంటరితనం వేధించడంతో విడాకులు తీసుకుంది. నా పట్ల నేను నిబద్ధతతో ఉండడం సవాళ్లతో నిండి ఉంది. చాలా ఒత్తిడికి గురయ్యా. ఇకభాగస్వామి కోసం ప్రయత్నిస్తా అంటూ ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.