పాకిస్తాన్ లో హనుమాన్ టెంపుల్.. మీరు చూసారా?

frame పాకిస్తాన్ లో హనుమాన్ టెంపుల్.. మీరు చూసారా?

praveen
సాధారణంగా ఇండియాను హిందూ దేశంగా పిలుస్తూ ఉంటారు అనే విషయం తెలిసిందే. అయితే హిందూ ముస్లిం క్రిస్టియన్లు అన్ని మతాలవారు ఇక్కడ ఉన్నప్పటికీ ఎందుకు ఇండియాకి హిందూదేశం అనే పేరు వచ్చింది. అయితే ఇండియాలో ఎక్కడ చూసినా కూడా ఎన్నో ఆలయాలు దర్శనమిస్తూ ఉంటాయి. ఇక అన్ని దేవుళ్లకు సంబంధించిన ఆలయాలు ప్రతి చోట ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అయితే భారత పొరుగు దేశమైన పాకిస్తాన్లో మాత్రం ఎక్కువ మంది ముస్లింలు ఉంటారు. అందుకే పాకిస్తాన్ ను ఇస్లామిక్ దేశం అని పిలుచుకుంటూ ఉంటారు అని చెప్పాలి. అక్కడ హిందూ దేవాలయాలు ఉండడం చాలా అరుదు.

 అయితే ఒకప్పుడు ఇలా భారత్ నుంచి వేరుపడిన సమయంలో పాకిస్తాన్లో కూడా ఇక ఎన్నో హిందూ దేవాలయాలు ఉండేవని.. కానీ రాను రాను వాటిని కూల్చివేశారు అనే ఒక వాదన కూడా ఎప్పుడు వినిపిస్తూ ఉంటుంది. అయితే ఇప్పటికి కూడా అక్కడ తక్కువ సంఖ్యలో ఇక హిందువులు ఉన్నారు అని చెప్పాలి. వారి కోసం ప్రత్యేకంగా కొన్ని దేవాలయాలు కూడా ఉన్నాయట. అయితే వివిధ రాష్ట్రాలలో వివిధ రకాల దేవతలను కొలుచుకోవడం చూస్తూ ఉంటాం. కానీ దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ కూడా కొలుచుకునే దేవుడు హనుమంతుడు. ఈ హనుమంతుడు విగ్రహం ప్రతి చోటా ప్రతి గ్రామంలో ఉంటుంది..

 అయితే ఇస్లామిక్ దేశంగా పేరుగాంచిన పాకిస్థాన్లో కూడా హిందువులందరూ కూడా పరమ పవిత్రంగా పూజించే హనుమంతుడి దేవాలయం ఉందట. అది కూడా పాకిస్తాన్ రాజధాని అయిన కరాచీలో ఈ ఆలయం ఉంది అన్నది తెలుస్తుంది. స్వయంభు పంచముఖ ఆంజనేయుడుగా ఇక్కడ స్వామి అనాదిగా పూజలు అందుకుంటున్నారట. శ్రీ సీతారామ లక్ష్మణులు ఈ ప్రాంతంలో విడితి చేశారని స్థల పురాణం చెబుతోంది. 8 అడుగుల ఎత్తులో హనుమ నరసింహ ఆదివారహ హయగ్రీవ గరుడ ముఖాలతో మూలవిరాట్ దర్శనమిస్తాడు అని చెప్పాలి. అయితే ఇక్కడ 21 ప్రదర్శనలు చేసుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: