పట్టాలపైకి వచ్చిన హంస.. సడెన్ బ్రేక్ వేసిన లోకో పైలెట్.. చివరికి?

praveen
సాధారణంగా పట్టాలపై రయ్ రయ్ మంటూ దూసుకు వెళ్లే రైలు ఎక్కడైనా ఆగింది అంటే.. అది కేవలం రైల్వే స్టేషన్ లో మాత్రమే ఆగుతుంది అన్న విషయం తెలిసిందే. కానీ మార్గమధ్యమంలో రైలు ఆగడం చాలా తక్కువగా చూస్తూ ఉంటాం. ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తినప్పుడు లేదంటే పట్టాలపై ఏదైనా సమస్య ఉన్నప్పుడు.. ఇక స్టేషన్ మాస్టర్ సిగ్నల్ ఇచ్చినప్పుడు మాత్రమే రైలు ఆగడం జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా రైలు పట్టాలపై దూసుకుపోతుండగా.. కారు లేదా ఏదైనా వాహనం పట్టాలపై అడ్డు వచ్చినప్పుడు లేదంటే మనుషులు, పశువులు కనిపించిన కూడా రైలు అస్సలు ఆగదు.

 మనుషులు, పశువులు సహా వాహనాలను ఢీకొడుతూనే దూసుకుపోతూ ఉంటుంది. ఇక ఇలా రైలు ఆగదు కాబట్టే ఎంతోమంది పట్టాలపై ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఎన్నో మూగజీవాలు పట్టాలు దాటుతూ చివరికి ప్రాణాలు కోల్పోతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇలా ఎలాంటి పరిస్థితుల్లో కూడా బ్రేక్ వేయని లోకో పైలట్ ఇక్కడ ఏకంగా పట్టాలపై ఒక హంసను చూసి బ్రేక్ వేశాడు. అదేంటి పట్టాలపై మనుషులు ఉంటేనే పట్టించుకోకుండా రైలు దూసుకుపోతూ ఉంటుంది. అలాంటిది ఏకంగా ఒక పక్షిని చూసి లోకో పైలట్ బ్రేక్ వేసి రైలు ఆపేయడమేంటి అనుకుంటున్నారు కదా..

  పట్టాలపై హంస ఉండడంతో చివరికి రైలు ఆగిపోయింది. నమ్మశక్యం కాని ఈ ఘటన లండన్ లో జరిగింది. పట్టాలపై హంస సంచరిస్తూ ఉండడంతో సుమారు 15 నిమిషాల పాటు రైలు నిలిచిపోయింది. దీంతో ఆ రూట్ లో వెళ్లాల్సిన మిగతా రైళ్లకు కూడా అంతరాయం ఏర్పడింది అని చెప్పాలి. ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. లండన్ చట్టాల ప్రకారం హంసలను రాజ కుటుంబ సంపదగా భావిస్తూ ఉంటారట. అందుకే హంసలకు ఏదైనా హాని తలపెడితే.. అది చట్ట ప్రకారం నేరం కిందికి వస్తుంది. అందుకే లోకో పైలట్ సైతం ఇది గ్రహించి వెంటనే హంస పట్టాల మీదికి రావడంతో రైలు ఆపేసాడు అన్నది తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: