పార్టీ జెండా పెట్టిన చిచ్చు.. కొడుకుని చంపిన తండ్రి?

praveen
ఎలక్షన్స్ వచ్చాయి అంటే చాలు ఊరువాడ అనే తేడా లేకుండా అంతట హడావిడి ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పటివరకు ఎక్కడ కనిపించని రాజకీయ నాయకులు అందరూ కూడా ఎలక్షన్స్ సమయంలో ఇక గల్లీలో వాలిపోతూ ఉంటారు. మేము మీ కోసం మంచి చేస్తాం అంటే.. మేము మీకోసం మంచి చేస్తామని తెగ గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. అంతేకాదు ఇక రాజకీయ నాయకులు ఇచ్చే హామీలు అయితే కొన్ని కొన్ని సార్లు ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే.

 ఇలా ఏకంగా రాజకీయ నాయకులు మేము ప్రజల మనిషిమి అని అందరిని నమ్మించేందుకు తెగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ఎలక్షన్స్ వచ్చాయి అంటే చాలు ఏకంగా ప్రచారాలు రాజకీయ నాయకులు ఇచ్చే హామీలు ఇక ఎలక్షన్ ముందు రోజు పంచే డబ్బులు ఏకంగా ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇచ్చే మందు ఇవే మాత్రమే గుర్తుకు వస్తూ ఉంటాయి. కానీ రాజకీయ నాయకులు బాగానే ఉన్నా ఏకంగా పార్టీల కోసం సొంత అన్నదమ్ములు ఏకంగా కుటుంబ సభ్యుల పోట్లాడుకోవడం ఒకరి ముఖం ఒకరు చూడటానికి కూడా ఇష్టం పడక మొహం తిప్పుకోవడం లాంటివి మాత్రం జరుగుతూ ఉంటాయి. ఇది చాలామందికి తెలిసిన బయటకి రాని నిజం అని చెప్పాలి. ఇలా ఎలక్షన్స్ కారణంగా పార్టీల పేరుతో కొట్టుకునే అన్నదమ్ములు నేటి రోజుల్లో చాలామంది కనిపిస్తూ ఉంటారు.

 ఇక్కడ ఇలాంటిదే జరిగింది. ఏకంగా ఎన్నికలు ఓ ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య అగ్ని రాజేసాయి  అయితే ఇది మన దగ్గర కాదు భారత దాయాది దేశమైన పాకిస్థాన్ లో జరిగింది. ఏకంగా కుటుంబ సభ్యుల మధ్య చేలరేగిన వివాదం ముదిరి చివరికి కొడుకుని తండ్రి దారుణంగా చంపేంత వరకు వెళ్ళింది. కైబర్ ఫక్తున్వ ప్రావిన్స్ లోని షెఫవర్ శివార్లలో ఈ ఘటన జరిగింది. తండ్రి వద్దు అని చెప్పిన వినకుండా కొడుకు ఇమ్రాన్ ఖాన్ పార్టీ జెండాను ఇంటిపై ఎగరవేశాడు. ఇదే విషయంపై ఇక తండ్రి కొడుకు మధ్య వాగ్వాదం జరగగా.. కోపంతో ఊగిపోయిన తండ్రి చివరికి కొడుకును కాల్చి చంపాడు. ఈ ఘటన కాస్త సంచలనంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: