
బుద్ధి మార్చుకోని చైనా.. కరోనా కంటే ప్రమాదకరమైన వైరస్ పై ప్రయోగాలు?
ఉద్దేశపూర్వకంగానే ఇక చైనా కరోనా వైరస్ కు సంబంధించిన అన్ని విషయాలను కూడా దాచి పెట్టింది అంటూ ఇక ప్రపంచ దేశాలు అన్నీ కూడా దుమ్మెత్తి పోసాయి. అయితే ఇప్పుడిప్పుడే వైరస్ ప్రభావం నుంచి అన్ని దేశాలు కూడా బయటపడుతున్నాయ్. ప్రజలు కూడా భయం లేని ప్రశాంతమైన జీవితాన్ని గడపగలుగుతున్నారు అని చెప్పాలి. ఇలాంటి సమయంలో చైనా మరోసారి కరోనా వైరస్ కాదు అంతకంటే ప్రమాదకరమైన వైరస్ పై ప్రయోగాలు చేస్తుంది అన్న వార్త ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేస్తుంది అని చెప్పాలి.
ఏకంగా కరోనా వైరస్ వ్యాప్తికి కారణమైంది అంటూ ప్రపంచ దేశాల నుంచి విమర్శలు ఎదుర్కొన్న చైనా ఇక తమ తీరును మాత్రం మార్చుకోలేదు. ఇక కరోనా మూలం అనుకుంటున్నా ఊహన్ లాబ్స్ లోనే SARS - COV-2 చెందిన GX-P2V పొంగోలిన్ వైరస్ పై పరిశోధనలు జరుగుతున్నాయట. అయితే ఇది కరోనా వైరస్ కంటే 100% శక్తివంతమైనది అని తెలుస్తోంది. ఏకంగా ఎలుకలపై ప్రయోగిస్తే ఐదు రోజుల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోయిందట. ఈ విషయం తెలిసి ఇక ప్రపంచ దేశాల ప్రజలందరూ కూడా భయపడిపోతున్నారూ. కరోనా సృష్టించిన విధ్వంసానే తట్టుకోలేకపోయాం ఇక ఇప్పుడు మరో వైరస్ అంటే ఇక ప్రాణాల మీద ఆశలు వదిలేసుకోవాల్సిందే అని అనుకుంటున్నారు. ఏమి జరుగుతుందో చూడాలి మరి.