కంట్లో ఐ డ్రాప్స్ కి బదులు జిగురు వేసుకుంది.. చివరికి?
ఇక ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కోవలోకి చెందినదే అని చెప్పాలి సాధారణంగా కళ్ళ రక్షణ కోసం కొంతమంది ఐ డ్రాప్స్ వేసుకోవడం చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా ఐ డ్రాప్స్ వేసుకోవడం కూడా మంచిది అని అటు వైద్యులు కూడా సూచిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక మహిళ ఐ డ్రాప్స్ వేసుకోవడం కారణంగా చివరికి కంటికి శస్త్ర చికిత్స చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రోజు లాగానే ఇక్కడ ఒక మహిళ ఐ డ్రాప్స్ వేసుకుంది. కానీ అదే ఆమె పాలిట శాపంగా మారిపోయింది.
ఎందుకంటే ఆమె వేసుకుంది రోజు వాడే ఐ డ్రాప్స్ కాదు పొరపాటున పరధ్యానంలో ఏకంగా ఐ డ్రాప్స్ కి బదులు జిగురును కంట్లో వేసుకుంది. ఈ ఘటన అమెరికాలో వెలుగులోకి వచ్చింది. జెన్నీఫర్ అనే యువతి ఐ డ్రాప్స్ కి బదులుగా సూపర్ గ్లూ అనే జిగురును కంట్లో వేసుకుంది. ఫలితంగా కనురెప్పలు మూసుకుపోయాయి. ఇలా గ్లూ కంట్లో వేసుకోగానే కళ్ళు మండుతుండడంతో జెనీఫర్ కుటుంబీకులు వెంటనే ఆసుపత్రికి తరలించారు అయితే ఆమె కనురెప్పలు రెండు కూడా అతుక్కుపోవడంతో డాక్టర్లు చేసేదేమీ లేక చివరికి కనురెప్పలను తొలగించారు. ఇలా ఆమె చేసిన చిన్న పొరపాటుకు ఆమె పెద్ద శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడింది.