అమెరికాలో మనోళ్లకు ఎంత కష్టం వచ్చిందో?
అయితే హెచ్ 4 వీసాకు సంబంధించిన ప్రాసెస్ దశాబ్దాలుగా జరుగుతూ ఉండడమే దీనికి కారణం అని తెలుస్తుంది. ఇలా ఇప్పుడు అమెరికా నుండి వెళ్ళిపోవాల్సిన వాళ్ళ సంఖ్య లక్షకు పైగా ఉంటుందని తెలుస్తుంది. అమెరికాలో శాశ్వత నివాసం ఉండటానికి వీలు కల్పించే గ్రీన్ కార్డ్ కోసం ఉద్యోగ ఆధారిత క్యాటగిరి కింద దరఖాస్తు చేసుకుని వెయిటింగ్ చేసే వాళ్ళ సంఖ్య 10.7 లక్షలకు పైగానే ఉంది.
ఇది చాలదన్నట్టు ఒక్కో దేశం నుండి ఏటా ప్రాసెస్ చేసే దరఖాస్తుల సంఖ్య ఏడు శాతానికి పరిమితం చేయడంతో సమస్య పెరిగిందని తెలుస్తుంది. ప్రస్తుతం అప్లై చేసే వాళ్ళకి గ్రీన్ కార్డు రావాలంటే సుమారు 135 లక్షలు సంవత్సరాల టైం పడుతుంది అని తెలుస్తుంది. 21 ఏళ్ల కన్నా తక్కువ ఉన్న వాళ్లు అమెరికాలో ఉండేందుకు ఏర్పాటు చేసిన వీసానే హెచ్4 వీసా. 1.34 లక్షల మంది భారతీయుల పిల్లలు 21 ఏళ్లు నిండగానే అమెరికానే వీడవలసి వస్తుంది ఇప్పుడు.
డిసైడ్ మైర్ ఇమిగ్రేషన్ వ్యవహారాల నిపుణులు హెచ్ వన్ బి వీసాతో అమెరికాలో నివాసం ఉంటున్న వారి బిడ్డలకు హెచ్ వన్ 4 వీసా ఇస్తారని తెలుస్తుంది. ఈ హెచ్ వన్ ఫోర్ వీసా కలవాళ్ళకు 21 ఏళ్లు నిండాయంటే అమెరికా నుండి వీడి బయటకి వెళ్ళవలసి ఉంటుంది. వాళ్లకి స్టూడెంట్ ఎఫ్ వీసా ఉండడం మాత్రం చాలా అరుదు. ఎందుకంటే అవి చాలా కాస్ట్లీ వీసాలట.