చిన్నారులు మొబైల్ కి బానిస కాకుండా.. చైనా షాకింగ్ నిర్ణయం?

praveen
మొబైల్.. మొబైల్.. మొబైల్.. ప్రస్తుతం ఆ రంగులాలా మొబైల్  ప్రపంచాన్ని ఏలేస్తుందా అంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరు అవును అనే సమాధానమే చెప్పగలుగుతారు. ఎందుకంటే కేవలం మనిషి అవసరాలు మాత్రమే తీర్చడానికి వచ్చిన మొబైల్.. ఇక ఇప్పుడు ఆ మనిషినే బానిసగా మార్చేసుకుంది. చిన్నల నుంచి పెద్దల వరకు సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరు కూడా మొబైల్ వినియోగించకుండా ఉండలేకపోతున్నారు. అయితే మొబైల్ ద్వారా ప్రతి పని సులభతరంగా మారిపోయింది.

 ఇక ఏ పనినైనా అరచేతిలో ఉన్న స్మార్ట్ఫోన్లో చేయగలుగుతున్నాడు మనిషి. దీంతో ఇక బయట ప్రపంచంతో మనిషికి అవసరమే లేకుండా పోయింది. కావాల్సినవన్నీ మొబైల్లోనే దొరుకుతూ ఉండడంతో మనిషి తన ప్రపంచాన్ని మొత్తం మొబైల్ లోనే చూసుకుంటున్నాడు. అయితే ఇటీవల కాలంలో చిన్న పిల్లలు మొబైల్ కి బానిసలుగా మారిపోతున్న పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. ఇక కరోనా వైరస్ వెలుగులోకి వచ్చాక డిజిటల్ క్లాస్ ల నేపథ్యంలో ఇలా మొబైల్ వాడకం మరింత పెరిగింది. దీంతో ఇక మొబైల్ వాడే అలవాటు లేని చిన్న పిల్లలు కూడా చివరికి ఆన్లైన్ క్లాసుల ద్వారా ఆ ఫోన్ కి బాగా అలవాటు పడిపోయి.. ఇక ఇప్పుడు గేమ్స్ లో మునిగి తేలుతున్న పరిస్థితి కనిపిస్తుంది.

 ఇలా ప్రస్తుతం రోజుల్లో స్మార్ట్ఫోన్ వినియోగం విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో.. పిల్లలు స్మార్ట్ ఫోన్లకు అడిక్ట్ అయిపోయి.. కొన్ని కొన్ని సార్లు పిచ్చిగా ప్రవర్తిస్తున్న పరిస్థితులు కూడా చూస్తున్నాం. అయితే ఈ వ్యసనాన్ని అరికట్టేందుకు చైనా ప్రభుత్వం కొత్త ఆలోచన చేస్తుంది. ఇందులో భాగంగానే 18 ఏళ్లలోపు పిల్లలు రోజులో కేవలం రెండు గంటలు మాత్రమే ఫోన్ చూసేలా మైనర్ మోడ్ ని ప్రవేశపెట్టాలని చూస్తుంది. ఇందుకోసం టెక్ కంపెనీలు కృషి చేయాలి అంటూ ఇక చైనాలోని సైబర్ స్పేస్ వాచ్ డాగ్ కొన్ని ప్రతిపాదనలు కూడా చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: