ఇది కేవలం ట్రైలర్ మాత్రమే.. రష్యాకు ఉక్రెయిన్ వార్నింగ్?

praveen
రష్యా - ఉక్రెయిన్ మధ్య దాదాపు గత ఏడాదికి పైగానే తీవ్ర స్థాయిలో యుద్ధం జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. చిన్న దేశమైన ఉక్రెయిన్ పై తమ అధిపత్యాన్ని కొనసాగించేందుకు రష్యా మొదలు పెట్టిన యుద్ధం ఇక ఇప్పుడు అగ్ర దేశమైన రష్యాని ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది. అయితే ఈ యుద్ధం లో వేల మంది సైనికులు ప్రాణాలు కోల్పోయిన ఇరు దేశాలు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. చర్చల ద్వారా శాంతియుతం గా వివాదాన్ని పరిష్కరించుకోవాలని ప్రపంచ దేశాలు సూచిస్తున్న ఒకవైపు రష్యా  మరో వైపు ఉక్రెయిన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు.


 అయితే ఉక్రెయిన్ దేశానికి అటు అమెరికా నుంచి మద్దతు లభిస్తున్న నేపథ్యం లో అగ్ర దేశమైన రష్యాను ఎంతో సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతుంది. ఈ క్రమంలోనే రష్యా సైనికులను ముప్పు తిప్పలు పెడుతూ ఒకరకంగా అగ్ర దేశమైన రష్యా పై చేయి సాధిస్తుంది అని చెప్పాలి. రష్యా ఎన్ని విధాలుగా ఉక్రెయిన్ ను ఇబ్బంది పెట్టినప్పటికీ ఇక ఆ దేశ సైనికులు తమసార్వభౌమత్వాన్ని రష్యా దగ్గర తాకట్టు పెట్టేందుకు సిద్ధపడటం లేదు. ఇటీవల రష్యా- ఉక్రెయిన్ యుద్ధం నేపద్యంలో ఉక్రెయిన్ దళాలు  నెమ్మదించాయని వార్తలు కూడా వస్తున్నాయి.


 ఇదే విషయం గురించి ఉక్రెయిన్ రక్షణ మంత్రి రజ్నీకొవ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటివరకు రష్యాకు ట్రైలర్ మాత్రమే చూపించామని అసలు కథ ముందుంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు ఉక్రెయిన్ రక్షణ మంత్రి. ఉక్రెయిన్ దళాలు మరింత శిక్షణ పొందాయని.. అత్యాధునిక  యుద్ధ ట్యాంకులు, సాయుధ వాహనాలతో రహస్య సైన్యంపై దాడికి సిద్ధమవుతున్నాము అంటూ ఆయన చేసిన కామెంట్లు కాస్త సంచలనంగా మారిపోయాయి. రష్యా నుంచి 300 కిలోమీటర్ల ప్రాంతాన్ని తిరిగి తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాము అన్న విషయాన్ని కూడా ఇటీవల ప్రకటించింది ఉక్రెయిన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: