వలసదారులపై బ్రిటన్‌లో కఠిన చర్యలు?

Chakravarthi Kalyan
సుదీర్ఘ కాలంగా బానిస బ్రతుకులు బతికిన సమయంలో అక్బర్, బాబర్, జహీంగర్ లాంటి వారు విదేశాల నుంచి దండయాత్రలు చేశారని గొప్పగా పాఠాలు చెప్పారు. కానీ వారిపై పోరాడిన భారతీయ వీరుల గురించి మనకు పాఠాలు ఎక్కువగా ఉండవు. కత్తి పట్టుకుని యుద్ధం చేసిన వీర మహిళ గురించి, 17 సార్లు మొగలులను తరిమిన పృథ్వీరాజ్ గురించి మన చరిత్ర పాఠాల్లో ఉండదన్న విమర్శలు ఉన్నాయి.


అందుకే దేశంలో చదువుకున్న యువతకు పోరాటం చేసిన వ్యక్తుల కంటే మన దేశం మీద దండెత్తిన రాజుల గురించి చెప్పారు. బానిసలుగా మారిన బతుకుల గురించి వివరించారు. అందుకే పోరాటం కంటే బానిసత్వానికే చాలా మంది అలవాటు పడ్డారు. సుదీర్ఘ కాలంగా బ్రిటిష్ వారు ఇండియాను పాలించారు. ఉపాధికోసం వచ్చిన బంగ్లాదేశీలను శరణార్థి అనాలి.


రోహింగ్యాలను శరణార్థి అనాలి. కానీ వారికి ఆధార్ కార్డు ఇవ్వాలని చెప్పడం, చొరబాటుదారులుగా వచ్చిన వారికి ఓటరు ఐటీ కార్డు ఇప్పించి వారితో ఓట్లు వేయించుకుని తర్వాత వారి ద్వారా గెలుపొందడం కొన్ని రాజకీయ పార్టీలకు అలవాటైపోయింది. కానీ వారు తదనంతర కాలంలో ఇండియాలోనే ఉంటూ దేశంపై విషం చిమ్మే కార్యక్రమాలు చేస్తుండటం చాలా దారుణం అయిపోయింది. ఇలాంటి వలస దారుల విషయంలో బ్రిటన్ ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది.


అక్రమంగా వలస వచ్చి ఉంటున్న వారిని గుర్తించి వారిని అరెస్టు చేసింది. మెకానిక్ షాపులు, బార్లు, రెస్టారెంట్లలో అక్రమంగా పని చేస్తున్న వారిని గుర్తించడానికి బ్రిటన్ ప్రధాని స్వయంగా రంగంలోకి దిగారు. దాదాపు 195 మంది అక్రమ వలసదారులను పట్టుకున్నారు. ఇదే సమయంలో ఇండియాలో అక్రమ వలసదారులని గుర్తిస్తే మాత్రం వారికి ఇండియాలో తెగ అన్యాయం జరిగిపోతుందని ఏడుస్తున్నారు. ఒక దేశంలో ఉండే వలసదారులను గుర్తించి పంపించేయొచ్చు. కానీ ఇండియాలో చొరబాటుదారులను గుర్తించకూడదా.. ఇదెక్కడి న్యాయం అంటూ మేధావులు విమర్శలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: