ప్రపంచంలోనే అత్యంత స్ట్రాంగ్ బీర్.. ధర ఎంతో తెలుసా?

praveen
ప్రపంచవ్యాప్తంగా మద్యం తాగే వారి సంఖ్య రోజురోజు పెరిగిపోతుంది తప్ప ఎక్కడ తగ్గడం లేదు. ఒకప్పుడు మద్యం తాగే వారిని విచిత్రంగా చూసేవారు జనాలు. కానీ ఇప్పుడు ఎవరైనా తమకు మద్యం తాగె అలవాటు లేదు అని చెప్పారు అంటే చాలు ఇక అందరూ వారిని విచిత్రంగా చూడటం మొదలు పెడుతున్నారు. అంతలా నేటి రోజుల్లో కాలం మారిపోయింది. అయితే మద్యం ఎక్కువగా సేవించే విషయంలో ప్రపంచ దేశాలలో ఇండియా ఐదవ స్థానంలో ఉంది. అంటే మన దేశంలో మద్యం ఎంతలా ఏరులై పారుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.



 ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే ఏ చిన్న ఫంక్షన్ జరిగిన అందులో ఫుల్లుగా మద్యం పెట్టడం సర్వసాధారణంగా మారిపోయింది. అయితే ఎండాకాలంలో అయితే ఎక్కువ మంది బీర్లు తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు. దీంతో ఇక మద్యం షాపుల్లో బీర్లు నిమిషాల వ్యవధిలో ఖాళీ అయిపోతూ ఉంటాయి. ఇక ఎక్కువ బీర్లు తాగి ఫుల్ కిక్కులో ఊగుతూ తూగాలని ఎంతోమంది ఆశపడుతూ ఉంటారూ అని చెప్పాలి. ఈ క్రమంలోనే స్ట్రాంగ్ బీర్లను తీసుకుంటూ ఉంటారు. ఇక ఎంత స్ట్రాంగ్ బీరు తాగినా దాని కిక్  కేవలం కొన్ని గంటలు మాత్రమే ఉంటుంది. కానీ ప్రపంచంలోనే అత్యంత స్ట్రాంగ్ బీర్ ఏది అంటే మాత్రం ఎవ్వరికి తెలియదు. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..


 ప్రపంచంలోనే అత్యంత స్ట్రాంగెస్ట్ బీరు పేరు స్నేక్ వెనమ్. ఈ బీరును  తయారు చేస్తున్నది బ్రేవ్ మాస్టర్ అనే కంపెనీనట. ఇక ఈ బీరు లోని ఆల్కహాల్ శాతం చాలా ఎక్కువగా ఉంటుందట. ఇందులో కంటెంట్ 67.5% ఉంటుందట. సాధారణ వైన్ షాపులలో దొరికే బీరు లోని ఆల్కహాల్ కంటెంట్ తో పోల్చి చూస్తే ఇది చాలా ఎక్కువ అని చెప్పాలి.. అయితే చాలా దేశాలు ఆల్కహాల్ కంటెంట్ పై ఇక పరిమితి ఉంటుంది. అయితే ఇక ప్రపంచంలోనే స్ట్రాంగ్ బీర్ స్నేక్ వెనమ్ ను చాలా తక్కువ మంది తాగేందుకు సాహసం చేస్తుంటారట. ఇక ఈ బీరు ధర దాదాపు 40 పౌండ్ల వరకు ఉంటుందట. అంటే భారత కరెన్సీలో 40,000 కంటే ఎక్కువే అని చెప్పుకోవాలి. అయితే ఈ స్ట్రాంగ్ బీర్ మొదటిసారి తాగితే ఏకంగా హాస్పిటల్ దగ్గర ఉంటే బెటర్ అని కొంతమంది సూచిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక బీరులోని ఆల్కహాల్ పరిమితి వల్ల ఏకంగా కొంతమంది స్పృహ కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. ఇక హ్యాంగ్ ఓవర్ కూడా అంతే స్ట్రాంగ్ గా ఉంటుందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: