సుందర్‌ పిఛాయ్‌ అలా చేయకుండా ఉండాల్సిందా?

Chakravarthi Kalyan
చదివిన చదువు తోటి, ఎదిగిన కెరీర్ తోటి కొంతమందికి ఏమవుతుందో తెలియదు. విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇలా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే గూగుల్ సీఈవో గురించి మనం అంతా, ప్రపంచమంతా గర్వంగా చెప్పుకుంటాం. కానీ ఆయన చేసిన పని తెలిసి కొంతమంది ఆయన ఇలా ఆలోచించాడు ఏంటి అనుకుంటున్నారు. ఎత్తుకు ఎదిగే కొద్దీ సెంటిమెంట్లు తగ్గిపోతాయని అంటూ ఉంటారు. దానికి సజీవ సాక్ష్యం సుందర్ పిచాయ్ అని అంటున్నారు ఇప్పుడు.

సుందర్ పిచాయ్ సామాన్య జీవనం నుండి ఇప్పుడు భారతదేశం గర్వించదగ్గ స్థాయిలో ఉన్నారు. ఆయన తమిళనాడులో 20 సంవత్సరాలు ఉండి తర్వాత విదేశాలకు వెళ్లిపోయారు. అక్కడ చిన్న ఉద్యోగం నుండి మొదలుపెట్టి సాఫ్ట్ వేర్ రంగంలో ముందుకు దూసుకు వెళ్లిపోయాడు. ఆ తర్వాత గూగుల్ సీఈఓ గా అవతరించాడు. అయితే ఇంత పేరు, డబ్బు, గౌరవం సంపాదించిన వ్యక్తి సెంటిమెంట్స్ ని మాత్రం పక్కన పెట్టేసాడట.

ఇదంతా ఎందుకు,  అసలు ఏమైంది అంటే తన తండ్రి ఉన్న ఇంటిని అమ్ముతూ ఉన్నారని తెలిసినా ఆయన రెస్పాండ్ అవ్వ లేదు అని తెలుస్తుంది. తాజాగా తమిళనాడులో ఉంటున్న తన తండ్రి, ఇంటిని  అమ్ముతూ కంటతడి పెట్టుకున్నారట. ఈ విషయం కూడా తమిళ నిర్మాత, నటుడు అయినటువంటి మణికంఠ ద్వారా బయటికి వచ్చినట్టుగా తెలుస్తుంది. అంత సంపాదించిన వ్యక్తి ఆ ఇంటిని అమ్ముతూ ఉంటే ఎలా చూస్తూ ఊరుకున్నాడని కొంతమంది అంటున్నారు.

ఆయన తలుచుకుంటే ఆ ఇంటి అమ్మకాన్ని నిలిపివేయడం పెద్ద పనా అంటున్నారు. డబ్బు సంపాదనలో పడి విలువలు మర్చిపోతే ఎలా అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే మణికంఠ మాట్లాడుతూ ఆయన తండ్రి ఇంటి కాగితాలు ఇస్తూ కంటతడి పెట్టుకున్నారని సుందర్ పిచాయ్ తండ్రి గారి ఇంటిని కొనడం చాలా గర్వంగానే ఉందని ఆయన అన్నారట. ఎన్నో ఏళ్లుగా జీవితంలో ఒక భాగమై పోయిన ఇంటిని అమ్మడం అంటే అది తీరని బాధ అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: