18 ఏళ్ల వరకు బడికి వెళ్లలేదు.. కానీ ఇప్పుడు కేంబ్రిడ్జ్ లో ప్రొఫెసర్?

praveen
సాధారణంగా ఒక వ్యక్తి ఏకంగా యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా మారి ఎంతోమంది విద్యార్థులకు పాఠాలు బోధించాలి అంటే అతనికి అందరితో పోల్చి చూస్తే కాస్త మేధస్సు ఎక్కువగానే ఉండాలి. అంతేకాకుండా సబ్జెక్టు పట్ల పట్టు కూడా ఉండాలి అని చెప్పాలి. ఇక క్లాసులో ఉన్న విద్యార్థులు ఎలాంటి డౌట్ అడిగినా కూడా నివృత్తి చేసే విధంగానే ఉండాలి. అయితే ఇలా ఎవరైనా వ్యక్తి ప్రొఫెసర్ గా మారాలి అంటే స్కూల్ దశ నుంచి బాగా చదివి ఇక మార్కుల్లో కూడా టాప్ ర్యాంక్స్ సొంతం చేసుకోవడం చూస్తూ ఉంటాము.

 ఇలా స్కూల్ దశ నుంచి చదువుల్లో చురుకుగా ఉన్నప్పుడే ఇక ఆ తర్వాత పెద్దయ్యాక ఏకంగా ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉద్యోగం చేపట్టే స్థాయికి ఎదిగేందుకు అవకాశం ఉంటుంది. కానీ ఎవరైనా చిన్నప్పటినుంచి చదువుకు దూరంగా నిరక్షరాస్యులుగా ఉన్న తర్వాత ఏకంగా యూనివర్సిటీలో ప్రొఫెసర్ కావడం గురించి ఎప్పుడైనా విన్నారా. అది కూడా ప్రపంచ వ్యాప్తంగా ఎంతగానో గుర్తింపు పొందిన కేంబ్రిడ్జి యూనివర్సిటీలో ప్రొఫెసర్ జాబ్ చేయడం అంటే అది ఆశ మసీ విషయం కాదు.

 లండన్ కు చెందిన 37 ఏళ్ల జాసన్ ఆర్డే అనే వ్యక్తి ప్రస్తుతం కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో  ప్రొఫెసర్ గా పనిచేస్తూ చరిత్ర సృష్టించాడు. అతి చిన్న వయసులోనే ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పని చేస్తూన్న నల్ల జాతి వ్యక్తిగా రికార్డ్స్ సృష్టించాడు.  అయితే అతను కేంబ్రిడ్జిలో  ప్రొఫెసర్ అంటే అతను చదువులో చిన్నప్పటి నుంచే చదువుల్లో  చురుకుగా ఉండి ఉంటాడని అందరూ అనుకుంటారు. కానీ ఏకంగా 18 ఏళ్ల వరకు అతను చదువుకోలేదు. చిన్నప్పటినుంచి ఆటిజం వ్యాధితో పుట్టిన జాసన్  11 ఏళ్ళ వరకు మాట్లాడే స్థితిలో లేడు.  ఇక 18 వరకు కూడా నిరక్షరాస్యుడు గానే ఉన్నాడు   కానీ ఆ తర్వాత చదువును ప్రారంభించి ఇక ఇప్పుడు 37 ఏళ్ల వయసులో కేం బ్రిడ్జ్ యూనివర్సిటీలో సోషియాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్  ప్రొఫెసర్ గా ఉన్నాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nri

సంబంధిత వార్తలు: