బట్టతల ఉందని.. ఉద్యోగం నుంచి పీకేశారు.. ఎక్కడంటే?

praveen
ఇటీవల కాలంలో ఎన్నో దిగ్గజ కంపెనీలు సైతం తమ కంపెనీలో పనిచేస్తున్న వేల మంది ఉద్యోగులకి ఊహించిన షాక్ ఇస్తున్నాయి. ఉన్నఫలంగా ఉద్యోగం నుంచి పీకి పారేస్తూ ఇక ఎంతోమంది జీవితాలను రోడ్డుపాలు చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఒక కంపెనీని చూసి మరో కంపెనీ ఇలా చేస్తున్నాయి. ఇటీవల కాలంలో మల్టీ నేషనల్ కంపెనీలు అన్నీ కూడా ఒకే బాటలో నడుస్తూ ఉన్నాయి అని చెప్పాలి. అయితే సాధారణంగా ఒక ఉద్యోగంలో చేరిన తర్వాత ఇక ఉద్యోగి సరిగ్గా పని చేయనప్పుడు ఇక అతని ఉద్యోగం నుంచి తొలగించడం లాంటివి చేస్తూ ఉంటారు.

 అయితే కొన్ని కొన్ని సార్లు బాగా పనిచేసినప్పటికీ అతని తీరు బాగా లేకపోతే ఇక ఉద్యోగం నుంచి పీకేయడం లాంటివి కూడా ఎన్నోసార్లు చూశాము. కానీ ఇక్కడ మాత్రం వెలుగులోకి వచ్చిన ఘటన మరింత విచిత్రమైనది అని చెప్పాలి. ఏకంగా అతనికి బట్టతల ఉంది అన్న కారణంతో అతను ఎలా పని చేస్తున్నాడు అన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా చివరికి ఉద్యోగం నుంచి పీకి పారేశారు. ఇక ఇలా బట్టతల ఉంది అన్న కారణంతో ఉద్యోగం నుంచి పీకేయడంతో అతని ఇగో హర్ట్ అయింది. ఇంకేముంది ఏకంగా తనను జాబ్ నుంచి పీకేసిన కంపెనీకి ఊహించని షాక్ ఇచ్చాడు సదరు వ్యక్తి.

 కోర్టును ఆశ్రయించి ఇదే విషయంపై ఫిర్యాదు చేశాడు అని చెప్పాలి. ఈ ఘటన ఇంగ్లాండులో వెలుగులోకి వచ్చింది. జోన్స్ అనే వ్యక్తి టాంగో నెట్వర్క్ అనే మొబైల్ ఫోన్ల సంస్థలో సేల్స్ డైరెక్టర్ గా పని చేస్తున్నాడు. అయితే బట్టతల ఉంది అనే కారణంతో అతన్ని బాస్ ఉద్యోగం నుంచి తీసేసాడు. దీంతో కోపంతో రగిలిపోయిన జోన్స్ సదర్ కంపెనీపై కోర్టులో దావా వేశాడు. అయితే ఇక ఈ కేసును విచారించిన కోర్టు జోన్స్ కు 71 వేల పౌండ్లు సుమారు భారత కరెన్సీలో 71 లక్షల రూపాయలు చెల్లించాలి అంటూ సదర్ కంపెనీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటన కాస్తా స్థానికంగా సంచులనంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nri

సంబంధిత వార్తలు: