మీకు తెలుసా.. ఆ దేశాల్లో వాలంటైన్స్ డే జరుపుకోరట?

praveen
వాలెంటెన్స్ డే వచ్చిందంటే చాలు ప్రేమికులు అందరిలో కూడా ఎక్కడలేని ఉత్సాహం వచ్చేస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అప్పటికే ప్రేమలో కొనసాగుతున్న వారు ఇక తాము ప్రేమించిన వారికి ఏదైనా స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఇక మరి కొంతమంది తమ ప్రేమను వ్యక్తపరిచేందుకు వాలెంటైన్స్ డేనే సరైన రోజు అని భావించి ఇక ఏడాది పొడవునా ఈరోజు కోసం వేచి చూడడం చేస్తూ ఉంటారు అని చెప్పాలి. కాగా తమ ప్రియమైన వారికి మనసులో ఉన్న ప్రేమను వ్యక్తపరిచి సంతోషంలో మునిగిపోతూ ఉంటారు ఎంతోమంది. వాలెంటైన్స్ డే  ఫిబ్రవరి 14వ తేదీన అయినప్పటికీ ఎంతోమంది అంతకుముందు కొన్ని రోజులు నుంచి ప్రేమికుల రోజును సెలబ్రేట్ చేసుకోవడం చేస్తూ ఉంటారు.

 కేవలం వాలెంటైన్స్ డే ఒక్క దేశానికి మాత్రమే పరిమితం కాలేదు దాదాపు ప్రపంచ దేశాలు అన్నీ కూడా ఈ వాలెంటైన్స్ డే ని ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటాయని చెప్పాలి. అయితే కొన్ని దేశాలు మాత్రం ఇప్పటికీ వాలంటైన్స్ డే కి దూరంగానే ఉన్నాయి. అక్కడ ప్రేమికుల రోజున జరుపుకోవడంపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఆ వివరాలు తెలుసుకుందాం..
 ఇండోనేషియా : ఇండోనేషియాలో వాలెంటైన్స్ డే ని జరుపుకోవడం పై ఏ చట్టం నిషేధం విధించకపోయినప్పటికీ అక్కడ ఎవరూ కూడా ప్రేమికుల రోజును జరుపుకోరట. అయితే కొన్ని ప్రాంతాల్లో వాలంటైన్స్ డే వ్యతిరేక ఊరేగింపులు జరుగుతాయి. అంతేకాకుండా ముస్లిం చట్టం కూడా వాలెంటైన్స్ డే జరుపుకోవడం అనుమతించట. అందుకే అక్కడ ఎవరూ కూడా ప్రేమికుల రోజును జరుపుకోరట.

 ఇరాన్  : ఇరాన్ కూడా ఒక ముస్లిం దేశం అన్న విషయం తెలిసిందే. ఇక్కడ మత పెద్దలు ఏది చెబితే అదే చట్టంగా మారుతూ ఉంటుంది. అయితే వాలెంటెన్స్ డే కి సంబంధించిన బహుమతులు వస్తువులు అమ్మడంపై   కూడా ఇక్కడ నిషేధించింది. పాశ్చాత్య   సంస్కృతిగా వాలంటైన్స్ డే ని భావించిన అక్కడి మత పెద్దలు వాలెంటెన్స్ డే కి బదులుగా మెహ్రిగాన్ అనే పాత పండుగను జరుపుకోవాలని సూచిస్తారు. ఈ పండుగ స్నేహం ప్రేమ మరియు ఆప్యాయత.లకు చిహ్నంగా ఉంటుంది
 పాకిస్తాన్ : పాకిస్తాన్లో వాలెంటైన్స్ డే డే పై ఎప్పుడు నిరసనలు వ్యక్తం అవుతూ ఉంటాయి అని చెప్పాలి. 2018లో ఇస్లామాబాద్ హైకోర్టు ద్వారా ఇక వాలెంటెన్స్ డే వేడుకపై నిషేధం విధించబడింది. అందుకే అక్కడ వాలెంటైన్స్ డే జరుపుకోరట.
 మలేషియా : మలేషియాలో కూడా ముస్లిం జనాభా గణనీయంగా ఉంది. అయితే 2005లో పత్వ జారీ అయింది. వాలెంటైన్స్ డే ఇస్లాంకు వ్యతిరేకంగా పరిగణించబడుతుంది. పాశ్చాత్య నాగరికత తో ముడి  పడి ఉంటుంది. అందుకే వాలంటైన్స్ డే రోజు ప్రతి ఏటా కూడా అక్కడ వ్యతిరేక ప్రచారం చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇక సౌతి అరేబియాలో కూడా వాలెంటెన్స్ డే జరుపుకున్న వారికి జైలు శిక్ష విధించడం లాంటివి చేశారు. ఉజ్బెకిస్తాన్లో కూడా ఇదే వాతావరణం కొనసాగుతూ ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: