అమ్మకానికి వచ్చిన ద్వీపం.. ధర తెలిస్తే షాకే?

praveen
సొంతిల్లును కొనుగోలు చేయాలనె కళ ప్రతి ఒక్కరికి ఉంటుంది అని చెప్పాలి.  కానీ ఇటీవల కాలంలో పెరిగిపోయిన వ్యయం ఇక భూముల ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉండడంతో సామాన్యుడికి సొంతింటి కలగానే మిగిలిపోతూ ఉంది అని చెప్పాలి. కానీ సంపన్నులు మాత్రం ఇక తమ అభిరుచులకు తగ్గట్లుగానే విలాసవంతమైన భవనాలను నిర్మించుకోవడం.. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో చాలా హాట్ టాపిక్ గా మారిపోతోంది. ముఖ్యంగా భారత వాణిజ్య రాజధానిగా పిలుచుకునే ముంబైలో ప్రస్తుతం భూముల ధరలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

 ఖరీదైన ప్రాంతంలో ఒక విలాసవంతమైన ఇల్లును కొనుగోలు చేయాలంటే పదుల కోట్లు కుమ్మరియాల్సిందే అని చెప్పాలి. అయితే కొన్ని కొన్ని సార్లు కోట్ల రూపాయల కుమ్మరించిన అక్కడ అపార్ట్మెంట్ కూడా కొనలేని పరిస్థితి నెలకొంది. అయితే ఇక ఇప్పుడు ముంబైలో ఒక ఖరీదైన ప్రాంతంలో అపార్ట్మెంట్ కొనే ధరకే ఏకంగా ఒక ద్వీపాన్ని సొంతం చేసుకోవచ్చు అన్న విషయం కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.  ఈ విషయం తెలిసి ప్రతి ఒక్కరు కూడా  షాక్ అవుతున్నారు అని చెప్పాలి. ఒక అపార్ట్మెంట్ ధరకు ద్వీపం ఎలా కొనుగోలు చేయొచ్చు అని అనుమాన పడుతున్న వారు కూడా కొంతమంది ఉన్నారు.

 మధ్య అమెరికాలోని నికర గువ్వా దేశంలో బ్లూ ఫీల్డ్స్ అనే ప్రాంతం నుంచి 19.5 కిలోమీటర్ల దూరంలో ఈ ద్వీపం ఉంది. దీని పేరు ఇగువాన ఐలాండ్.  సుమారు 5 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. మూడు గదుల విలాసవంతమైన ఇల్లు ఇక్కడ ద్వీపంలో ఉంటుంది అని చెప్పా.లి ఇక ఈ ఇంటిలో హాల్ కిచెన్ బార్ లివింగ్ ఏరియా తో పాటు పని వారి కోసం ప్రత్యేకంగా కొన్ని గదులు కూడా ఉంటాయి అని చెప్పాలి.  ఇక ఇంటి బయట స్విమ్మింగ్ ఫూల్, ఫిష్ డాక్ను కూడా నిర్మించారు. అంతేకాదు చుట్టుపక్కల ఉన్న ప్రకృతి అందాలను చూసేందుకు ఇక అక్కడ 28 అడుగుల ఎత్తైన వాచ్ టవర్ కూడా నిర్మించారు అని చెప్పాలి. ఇక ఈ ద్వీపం ధర ఎంతో తెలుసా 3.87 కోట్లు మాత్రమే. అంటే ముంబైలో ఒక అపార్ట్మెంట్ ధర కంటే తక్కువే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: