జాబ్ నుంచి పీకేసినందుకు.. 15 లక్షలు చెల్లించిన కంపెనీ?
సాదరణంగా అయితే కంపెనీ యాజమాన్యం ఇక తమ కంపెనీలో పనిచేసే ఉద్యోగులను ఉంచుకోవాలా లేకపోతే ఉద్యోగం నుంచి పీకేయాల అన్నది వారు ఇష్టానుసారంగానే ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక దీనికోసం ఎవరి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అయితే కొంతమంది ఉద్యోగుల విషయంలో కంపెనీ కూడా రూల్స్ ప్రకారమే వ్యవహరించాల్సి ఉంటుంది. ఒకవేళ రూల్స్ కి విరుద్ధంగా వ్యవహరిస్తూ ఉద్యోగం నుంచి పీకేస్తే మాత్రం మొదటికే మోసం వస్తుంది అని చెప్పాలి. ఇక్కడ ఒక కంపెనీకి ఒక ఉద్యోగిని విషయంలో ఇలాంటి చేదు అనుభవం ఎదురయింది. యూకే కి ఓ కంపెనీ మహిళ ఉద్యోగినిని తొలగించినందుకుగాను 15 లక్షలు జరిమానా చెల్లించింది.
చార్లెట్ లీచ్ అనే మహిళ ఒక సెక్యూరిటీ సంస్థలో అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ఉద్యోగిగా పనిచేస్తుంది. ఇటీవల సదరు మహిళ గర్భం దాల్చింది. అయితే ఉద్యోగి కాంట్రాక్టు పై సంతకం చేయనందున ప్రసూతి సెలవులు ఇవ్వబోము అంటూ ఆమెను ఉద్యోగం నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు కంపెనీ యాజమాన్యం. దీంతో తన పరిస్థితిని పూర్తిగా వివరిస్తూ లీవ్ కోర్టును ఆశ్రయించింది సదరు మహిళ ఉద్యోగిని. ఈ క్రమంలోనే ఈ కేసు పై విచారణ జరిపిన కోర్టు ఏకంగా బాధితురాలికి 15 లక్షల రూపాయలు కంపెనీ చెల్లించాల్సిందిగా తీర్పును ఇవ్వడం గమనార్హం.