ఓరి నాయనో.. ఒక్క పైనాపిల్.. అక్షరాల రూ. లక్ష?

praveen
ఇటీవల కాలంలో సోషల్ మీడియా అన్నది ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చింది అన్న విషయం తెలిసిందే . ఈ క్రమంలోనే సామాన్యులు సైతం సెలబ్రిటీలస్ లాగానే ఇక సోషల్ మీడియాలో తమకు ఇష్టం వచ్చిన పోస్టులు పెట్టడానికి అవకాశం కూడా ఉంది. అదే సమయంలో ఇక సోషల్ మీడియా అందరికీ అందుబాటులో ఉన్న నేపథ్యంలో ప్రపంచ నలమూలల్లో ఎక్కడ ఏం జరిగినా కూడా కేవలం నిమిషాల వ్యవధిలోనే తెలుసుకోగలుగుతున్నారు ప్రతి ఒక్కరు. ఈ క్రమంలోనే ఇలా ఇంటర్నెట్ లోకి వచ్చే కొన్ని విషయాలు ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యానికి లోను చేస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే.

 ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వార్త కాస్త వైరల్ గా మారిపోయింది. ఇంతకీ ఇప్పుడు వైరల్ గా మారిపోయిన వార్త దేని గురించో తెలుసా.. అందరూ ఇష్టపడే రుచికరమైన  ఫైన్ ఆపిల్ గురించి. పైనాపిల్ గురించి పెద్దగా వార్త ఏమంటుంది.. సాధారణంగా ఆ పండు ఆరోగ్యానికి మంచిది.. తినాలని డాక్టర్లు కూడా సూచిస్తూ ఉంటారు ఇలాంటిదే కదా అని అనుకుంటారు అందరూ. కానీ ఇక్కడ వైరల్ గా మారిన వార్త మాత్రం పైనాపిల్ ధరకు సంబంధించింది. సాధారణంగా పైనాపిల్ ఎంత ధర ఉంటుందో దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది.. మహా అయితే వందల్లో  ఉంటుంది. కానీ ఏకంగా ఒక్క పైనాపిల్ లక్ష రూపాయలు ధర పలుకుతుంది అంటే నమ్ముతారా.

 ఊరుకోండి బాసు పైనాపిల్ ఏంటి.. లక్ష రూపాయలు ధర పలకడమేంటి అని ఇదంతా జోక్ అనుకొని కాసేపు నవ్వుకుంటారు. అలా అనుకున్నారు అంటే పప్పులో కాలేసినట్లే.. ఎందుకంటే ఇటీవల బ్రిటన్ లో ఏకంగా ఒక్క పైనాపిల్ కి లక్ష రూపాయలు ధర పలుకుతుంది. అయినప్పటికీ కొనుగోలు చేయడానికి ఎగబడుతున్నారు అక్కడి జనాలు. అత్యంత అరుదుగా లభించే హెలికాన్ అనే పైనాపిల్ కు ఇలా భారీ డిమాండ్ ఏర్పడింది అని చెప్పాలి.  అయితే ఈ పంట చేతికి వచ్చేసరికి మూడేళ్లు పడుతుందట. ఇక ఇలా మూడేళ్ల పాటు అధిక ఖర్చులు ఉంటాయట. ఇక పెట్టుబడి పోను లాభాలు రావాలంటే లక్ష రూపాయలకు ఒక ఫైన్ ఆపిల్ను అమ్మాల్సిందేనట. అయితే ఈ పైనాపిల్ బహిరంగ వేలంలో అయితే పది లక్షల వరకు కూడా పలుకుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nri

సంబంధిత వార్తలు: