వావ్.. మనిషి ప్రాణాలు కాపాడే ఎలుక?

praveen
రోజురోజుకీ టెక్నాలజీలో వస్తున్న అనూహ్యమైన మార్పులు అందరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉన్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక టెక్నాలజీని ఎంతగానో వినియోగించుకుంటున్న వారు ఇక మార్పులకు ఎంతగానో అలవాటు పడిపోతున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక మనుషుల ప్రాణాలకు రక్షణ కల్పించే విధంగా అధునాతన టెక్నాలజీని తీసుకువస్తూ ఉన్నారు శాస్త్రవేత్తలు. కొన్ని కొన్ని సార్లు ఇక వినూత్నమైన టెక్నాలజీకి సంబంధించిన వార్తలు ఏవైనా బయటికి వచ్చాయంటే చాలు అందరి దృష్టిని ఆకర్షిస్తూ అందరిని ఆశ్చర్యపోయేలా చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇలాంటి వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

 సాధారణంగా ఇంట్లో ఎలుకలు ఉన్నాయి అంటే చాలు వాటికోసం ప్రత్యేకమైన బోన్లు ఏర్పాటు చేసి ఇక ఇంట్లో నుంచి తరిమికొట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఇక ఇంట్లో ఎలుకలు ఉన్నాయి అంటే చాలు అన్ని వస్తువులను కొరికి తినేసి ఏకంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి. అయితే ఇక ఇప్పుడు మాత్రం ఏకంగా ఎలుకలే మనుషుల ప్రాణాలను కాపాడబోతున్నాయి అన్నది తెలుస్తుంది. అదేంటి ఎలుకలు మనుషుల ప్రాణాలు కాపాడుటమేంటి ఇదేదో వినడానికి విచిత్రంగా ఉంది అని అనుకుంటున్నారు కదా. కానీ నేను చెప్పేది నిజమే.

 నిజంగానే ఎలుకలు మనుషుల ప్రాణాలను కాపాడబోతున్నాయి. ఎలా అంటారా.. భూకంపాలు వరదలు సంభవించినప్పుడు భవనాలు కుప్పకూలిపోవడం జరుగుతూ ఉంటుంది. అలాంటి సమయంలోనే శిధిలాల కింద చిక్కుకున్న వారికి సరైన సమయంలో సహాయం అందగా చివరికి ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. ఇక ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు బెల్జియం నాన్ ప్రాఫిట్ సంస్థ కొన్ని ఎలుకలకు ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇస్తుంది. అట ప్రమాద సమయంలో ఈ ఎలుకలు లొకేషన్ బీపర్ ఉన్న సూట్ ని తగిలించుకొని ఇక శిధిలాల కింద ఉన్న మనుషుల దగ్గరికి వెళ్తూ ఉంటాయట. తద్వారా ఇక మనుషులు ఎక్కడున్నారు అన్న విషయం స్పష్టంగా తెలిసే విధంగా సమాచారం అందిస్తూ ఉంటాయట ఈ ఎలుకలు. ఇలా మనుషుల ప్రాణాలను కాపాడతాయట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: