అద్భుతం : అర్థరాత్రి సూర్యుడు ఉదయించే.. ఈ ప్రాంతాల గురించి తెలుసా?

praveen
ఈ విశాల భూమండలంలో ఎన్నో వింతలు విచిత్రాలు అన్న విషయం తెలిసిందే  ముఖ్యంగా ప్రకృతి అందాలకు అద్భుతాలకు అయితే కొదవలేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఇక ప్రపంచ ప్రజానీకానికి తెలియని ఎన్నో అద్భుతాలు ఈ సృష్టిలో దాగి ఉన్నాయి. అలాంటిదే అర్ధరాత్రి కూడా సూర్యుడు ఉదయించడం. సాధారణంగా అందరికీ తెలిసిన ప్రకారం ఉదయం సమయంలో సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడు అన్న విషయం తెలిసిందే. అయితే కొన్ని దేశాల్లో రాత్రి అయితే మరికొన్ని దేశాల్లో మాత్రం పగలు అవుతూ ఉంటుంది. కానీ కొన్ని ప్రాంతాలలో మాత్రం అర్ధరాత్రి సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడట. ఇది వినడానికి కాస్త విచిత్రంగా ఉంది కదా.

 ఆర్కిటిక్, అంటార్కిటిక్ ప్రాంతాల్లో వేసవి నెలలో అర్ధరాత్రి దాటిన తర్వాత సూర్యుడు ఉదయిస్తాడట. ఇక ఇలా సూర్యుడు ఉదయించే ఐదు ప్రాంతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
 అలాస్కా  : యూఎస్ లోని అలస్కా ఒక విశాలమైన నగరంగా పేరొందింది. ఇక్కడ ప్రాంతాల్లో స్థానిక సంస్కృతి అందరి దృష్టిని ఆకర్షిస్తుంటుంది. ఇక మెరిసే మంచుతో కప్పబడిన పర్వతాలు ఎంతో ప్రసిద్ధి చెందినవి అని చెప్పాలి  . అయితే మే చివరి నుంచి జూలై చివరి వరకు కూడా చలికాలంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయట. ఈ క్రమంలోనే అలస్కాలోని బారో అనే నగరంలో 24 గంటలు సూర్యుడు కనిపిస్తూనే ఉంటాడు.
 నార్వే : ఇక నార్వే ప్రాంతాన్ని కూడా అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే ప్రాంతంగా పిలుస్తూ ఉంటారు. ఇక మిడ్ నైట్ లో అక్కడి ప్రజలందరూ కూడా సూర్యుడు సౌందర్యాన్ని వీక్షిస్తూ ఉంటారు అని చెప్పాలి. జూలై మధ్య దాదాపు 76 రోజులపాటు ఇక్కడ సూర్యుడు అస్తమించకుండానే వెలిగిపోతూ ఉంటాడట.
 ఫిన్లాండ్  : ఫిన్లాండ్ నార్త్ లైట్స్  ఆకర్షణీయమైన పర్యటక ప్రాంతం అని చెప్పాలి. అర్ధరాత్రి ఇక్కడ సూర్యుడిని చూసే అవకాశం కూడా లభిస్తూ ఉంటుంది. 24 గంటల పాటు సూర్యుడు వెలుగులు విరచిమ్ముతూనే ఉంటాడట.
 స్వీడన్  : ఈ ప్రాంతంలో సూర్యుడు అర్థరాత్రి సమయంలో అస్తమించి ఇక తెల్లవారుజామున మళ్లీ ఉదయిస్తాడట. ఇక దాదాపు నాలుగు నెలల పాటు సూర్యుడు నేరుగా అస్తమించకుండా ఇలా అర్ధరాత్రి అస్తమిస్తాడట. అందుకే స్పీడన్ లో మిడ్ నైట్ సన్ చూసిన అనుభవం చాలా గొప్పదని ఎంతో మంది అంటుంటారు.
 కెనడా : కెనడా లోని  యుకాన్, వాయువ్య భూభాగాలు ఉన్న ప్రాంతాల్లో కూడా సూర్యుడు అర్థరాత్రి ఉదయిస్తూ ఉంటాడట. ఇక ఇలా సూర్యుడు అర్థరాత్రి ఉదయించడంతో ఆ దృశ్యాలను చూసేందుకు ఎంతో మంది పర్యాటకులు తరలివస్తారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: