ఇదెక్కడి విచిత్రం.. పిడుగు పడితే కంటిచూపు వచ్చింది?

praveen
ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు కంటిచూపు కోల్పోయాడు. కానీ ఇటీవల పిడుగు పడటం కారణంగా అతనికి కంటి చూపు వచ్చింది. ఈ విషయం చెబితే ఎవరైనా నమ్ముతారా.. ఏంటి బాసూ పొద్దున జోకులు వేస్తున్నారు కంటి చూపు పోవడం ఏంటి.. పిడుగు పడిన తర్వాత మళ్లీ రావడం ఏంటి.. ఇలాంటివి సినిమాల్లో తప్ప నిజ జీవితం లో జరగవు.  అవును మరి  సినిమాలో హీరో తలమీద కొట్టినప్పుడు గతం మర్చిపోవడం తర్వాత కుటుంబ సభ్యులను హీరో కూడా గుర్తు పట్టకపోవడం మరోసారి తలమీద కొట్టినప్పుడు గత మొత్తం గుర్తు రావడం లాంటివి సినిమాలో జరుగుతూ ఉంటాయి.

 ఇలాంటివి జరిగినప్పుడు ప్రేక్షకులందరూ వావ్ సూపర్ అంటూ తెగ చప్పట్లు కొడుతూ ఉంటారు అని చెప్పాలి.కానీ నిజ జీవితంలో ఇలాంటి ఘటనలు జరిగితే మాత్రం అస్సలు నమ్మరు. ఇలాంటి ఘటనలు జరగవు అని కూడా చెబుతూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం ఇలాంటి తరహా ఘటన జరిగింది. మీరు నమ్మినా నమ్మక పోయినా ఇప్పుడు మనం మాట్లాడుకునే ఘటన మాత్రం నిజంగానే జరిగింది. ఒక వ్యక్తి దురదృష్టవశాత్తు యాక్సిడెంట్లో కంటిచూపును కోల్పోయాడు. ఇక ఎన్నో రోజుల పాటు గుడ్డివాడిగా అంధకారంలోనే బ్రతికాడు సదరు వ్యక్తి. కానీ కొంతకాలానికి మళ్లీ అతనికి కంటి చూపు తిరిగి వచ్చింది.

 ఎలా అంటారా హాయిగా కొబ్బరి చెట్టు కింద కూర్చుని సేదతీరుతున్న సమయంలో ఒక్కసారిగా అక్కడ పిడుగు పడింది. ఇక పిడుగు పడిన తర్వాత అతనికి ఏమీ కాలేదు. కానీ ప్రమాదంలో కోల్పోయిన కంటి చూపు మాత్రం మళ్ళీ వచ్చింది. దీంతో అతని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఇలా కంటి చూపు కోల్పోయి మళ్ళీ తిరిగి రావడానికి ఎడ్విన్ రాబిన్స్ కి  తొమ్మిదేళ్ళ సమయం పట్టింది అని చెప్పాలి.  9 ఏళ్ల పాటు అతను అనుభవించిన నరకం మాటల్లో చెప్పలేనిది.. ఈ విషయం గురించి తెలుసుకుని అందరు ఆశ్చర్యపోతుంటే.. దేవుడు కరుణించడం అంటే ఇదేనేమో అని మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: