గాల్లో విమానం.. నిద్రపోయిన పైలెట్లు.. చివరికి కళ్ళు తెరిచాక షాక్?

praveen
సాధారణంగా విమానం నడిపే వారు ఎప్పుడూ ఎంతో అప్రమత్తంగా ఉండాలి. ఒకవైపు ఎయిర్లైన్స్ నుంచి వస్తున్న సిగ్నల్స్ గమనిస్తూ విమానాన్ని నడపాల్సి ఉంటుంది. కానీ కొంత మంది పైలెట్లు మాత్రం విమానం గాల్లోకి ఎగిరిన తర్వాత నిర్లక్ష్యంగా వ్యవహరించడం లాంటివి చేస్తూ ఉంటారు. ఏకంగా విమానం నడపడం మానేస్తే నిద్ర పోవడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే ఇలాంటివి కేవలం సినిమాల్లోనే కాదు నిజజీవితంలో కూడా జరుగుతూ ఉంటాయి అన్న దానికి నిదర్శనంగా ఎన్నో ఘటనలు ఇప్పటికే వెలుగులోకి వచ్చాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగుచూసింది అనే చెప్పాలి.

 ఇటీవలే ఇతియోఫియాన్ ఎయిర్ లైన్స్ చెందిన బోయింగ్ విమానం సూడన్ లోని కార్టూమ్ నుంచి ఇథియోపియా రాజధాని అడిస్ అబాబా కు ప్రయాణికులతో బయలుదేరింది. అయితే విమానం ఏకంగా 37 వేల అడుగుల ఎత్తులో ఉంది. ఇలాంటి సమయంలో ఇక విమానం నడుపుతున్న ఇద్దరు పైలెట్లు కూడా నిద్ర లోకి జారుకున్నారు.  విమానం ఆటో పైలెట్ మోడ్ లోకి వెళ్ళిపోయింది. అయితే ఫ్లైట్ మేనేజ్మెంట్ కంప్యూటర్ ఏర్పాటుచేసిన మార్గానికి అనుగుణంగా విమానం ప్రయాణిస్తూ ఉంది. అయితే నిర్దేశించిన రన్ వే ల్యాండ్ అవ్వాల్సి ఉండగా.. అలా జరగలేదని.. ఇక పైలెట్లు కూడా తమ కాల్స్ కు స్పందించటం లేదు అంటూ ట్రాఫిక్ కంట్రోలర్లు గుర్తించారు.

 ఈ క్రమంలోనే ఆటో పైలెట్ మోడ్ డిస్కనెక్ట్ చేయడమే కాదు.. అలారం గట్టిగా మోగించారు. ఈ క్రమంలోనే నిద్రలేచిన పైలెట్లు 25 నిమిషాల తర్వాత రన్వేపై సురక్షితంగా విమానాన్ని ల్యాండ్ చేశారు. దీంతో ఏం జరుగుతుందో తెలియక ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని విమానం సేఫ్ గా ల్యాండ్ అవ్వడంతో చివరికి ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఆ తర్వాత మూడు గంటల పాటు ఎయిర్పోర్టులోనే ఉండి  అభిమానం తర్వాత మరో జర్నీకి బయలుదేరినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటనపై ఆటో ప్రయాణికులందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: