టేబుల్ కింద వింత గుర్తు.. ఏంటా అని చూస్తే షాక్?

praveen
ఇప్పటికి కూడా డైనోసార్ వందల ఏళ్ల సంవత్సరాల క్రితం భూమ్మీద బ్రతికింది నిజమే అనే దానికి నిదర్శనంగా ఎన్నో గుర్తులు భూమ్మీద తారసపడుతుంటాయ్ అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పటి వరకు ఎంతో మంది శాస్త్రవేత్తలు ఇదే విషయంపై పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. జురాసిక్ పార్క్ అనే సినిమా ద్వారా డైనోసార్లు ఎలా ఉంటాయన్న విషయాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు అని చెప్పాలి. ఇక్కడ ఓ రెస్టారెంట్ కి వెళ్లిన వ్యక్తికి కూడా డైనోసార్ కు సంబంధించిన గుర్తులు  కనిపించడం గమనార్హం.
 ఎంచక్కా భోజనం చేసేందుకు స్థానికంగా ఉన్న ఒక రెస్టారెంట్ కి వెళ్ళాడు సదరు వ్యక్తి. ఇక చెట్టు కింద ఉన్న టేబుల్ పై కూర్చుని ఆర్డర్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు.  ఈ క్రమంలోనే టేబుల్ కింద ఒక వింత గుర్తును చూశాడు.. దీంతో ఇది ఏంటా అని ఆలోచనలో పడిపోయాడు.. కానీ అసలు విషయం తెలిస్తే ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఈ ఘటన నైరుతి చైనా ప్రావిన్స్ అయినా సిచువాన్ లోని ఓ రెస్టారెంట్ లో వెలుగులోకి వచ్చింది. టేబుల్ కింద 100 మిలియన్ సంవత్సరాల నాటి డైనోసార్ పాదముద్రలను ఔ హంగ్ట్ అనే అనే వ్యక్తి కనుగొన్నాడు. వెంటనే పరిశోధకులకు సమాచారం అందించాడు.

 అయితే వెంటనే అక్కడికి చేరుకున్న పరిశోధకులు ఇక అక్కడ ఉన్న పాదముద్రలు 2 జాతుల సౌరోపాడ్ లకు చెందినవి అని గుర్తించారు. ఇది బ్రోంబోసారస్ సారస్ ల గుర్తులు  అంటూ పరిశోధకులు తేల్చారు.. ఇప్పటివరకు భూమ్మీద జీవించి ఉన్న అతిపెద్ద జంతువులు ఇవే అంటూ పరిశోధకులు పరిగణిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే దాదాపు 65 మిలియన్ సంవత్సరాల క్రితం జీవించి ఉన్నాయంటూ పరిశోధకులు తెలిపారు. ఇక ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా కూడా ఇలాంటి అరుదైన గుర్తులు బయటపడుతున్నాయి శాస్త్రవేత్తలు చెప్పుకొచ్చారు. ఇక్కడ రెస్టారెంట్ టేబుల్ కింద బయటపడిన గుర్తు చుట్టూ ఒక ప్రత్యేకమైన కంచె ఏర్పాటు చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: