ఓరి నాయనో.. 40 ఏళ్లకే 44 పిల్లలకు జన్మనిచ్చిన మహిళ?

praveen
టైటిల్ చూడగానే ఆశ్చర్యపోయారు కదా.. అసలు ఇది ఎలా సాధ్యమైంది అని ఆలోచనలో పడిపోయాడు కదా.. 40 ఏళ్ల మహిళకు 44 మంది పిల్లలు జన్మించడం కచ్చితంగా  అసాధ్యం అని అనుకుంటున్నారు కదా. కానీ మీరు అందరూ అసాధ్యం అనుకుంటున్నది ఇక్కడ ఒక మహిళ మాత్రం సాధ్యమే అని నిరూపించింది. నిజంగానే 40 ఏళ్ల మహిళ 44 మంది పిల్లలకు జన్మనిచ్చింది. దీంతో సదరు మహిళకు సంబంధించిన వార్త కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.

 సాధారణంగా ఏడాదికి ఒక శిశువుకు జన్మనిచ్చేందుకు మహిళలకు అవకాశం ఉంటుంది. దాదాపు ప్రతి ఒక్కరు 9 నెలల పాటు శిశువును కడుపులో మోయాల్సి ఉంటుంది. కాబట్టి ఇక 40 సంవత్సరాల లో 44 మంది పిల్లలకు జన్మనివ్వడం అసాధ్యం. కానీ ఇక్కడ ఒక మహిళ మాత్రం తనకు ఉన్న ప్రత్యేకమైన ఆరోగ్య పరిస్థితి కారణంగా ఈ రికార్డును సాధించింది అని చెప్పాలి. 12 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుంది సదరు మహిళ.. ఈ క్రమంలోనే 44 మంది పిల్లలకు జన్మనిచ్చింది. ఈ ఘటన ఉగాండాలో వెలుగులోకి వచ్చింది ఆమె పేరు నాభా టాంజి. 12 ఏళ్ల వయస్సు లోనే ఆమెకు పెళ్లి అయింది.

 అయితే ఆమెకు ఉన్న అరుదైన ఆరోగ్య పరిస్థితి కారణంగా ప్రతి కాన్పులో కూడా ఇద్దరు లేదా ముగ్గురు శిశువులకు జన్మనిస్తూ వచ్చింది సదరు మహిళ. కొన్ని కాన్పుల్లో  అయితే నలుగురు కూడా పుట్టిన సందర్భాలు ఉన్నాయట. దీంతో 40 ఏళ్లు వచ్చేసరికి 44 మంది పిల్లలకు జన్మనిచ్చింది ఆమె. అయితే సదరు మహిళ అండాశయాలు అసాధారణ రీతిలో ఉండడమే ఇలా ఎక్కువ మంది పిల్లలకు జన్మనివ్వడానికి కారణమని వైద్యులు చెబుతుండడం గమనార్హం. మహిళల్లో ఈ పరిస్థితిని హైపర్ ఓవులేషన్ అని అంటారట. కాగా 44 మంది పిల్లల్లో ఆరుగురు  చనిపోగా ప్రస్తుతం 20 మంది అబ్బాయిలు 18 మంది అమ్మాయిలు ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nri

సంబంధిత వార్తలు: