యూట్యూబ్ లో అప్లోడ్ అయిన.. మొదటి వీడియో ఇదేనట తెలుసా?

praveen
ప్రస్తుతం యూట్యూబ్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగం గా మారి పోయింది అన్న విషయం తెలిసిందే. ఇలా ఎంతో మంది గంటల తరబడి యూట్యూబ్ లోనే కాలక్షేపం చేస్తూ ఎంటర్టైన్మెంట్ పొందుతూ ఉన్నారు.  యూట్యూబ్లో కావాల్సిన అన్ని రకాల సమాచారం అందు బాటులో ఉండడం తో ఇక నెటిజన్లు అందరికీ కూడా మరో యాప్ వైపు కన్నెత్తి చూడాల్సిన అవసరం రాకుండా పోయింది. ఈ క్రమం  లోనే ఎంతో మంది యూట్యూబ్లో చదువులు కూడా చదివిస్తున్న ఘటనలు వెలుగు  లోకి వస్తూనే ఉన్నాయి.

 నవ్వు తెప్పించే ఎంటర్టైన్మెంట్ దగ్గర్నుంచి.. ఎంతో ఇన్ఫర్మేషన్ తో కూడిన  వీడియో తో పాటు నేరాలకు ఎలా పాల్పడాలి.. దొరకకుండా ఎలా ఉండాలి అనే విషయాలను నేర్చుకోవచ్చు యూట్యూబ్ లో.  ఇటీవలి కాలం లో యూట్యూబ్ అనేది ఎంతో మందికి ఇన్కమ్ సోర్స్ గా మారి పోయిందని చెప్పాలి. ఎంతోమంది సరికొత్త వీడియోను యూట్యూబ్లో అప్లోడ్ చేయడం ద్వారా లక్ష రూపాయలు సంపాదించడం లాంటివి కూడా చేస్తున్నారు. ఇలా ప్రతి రోజు వేల సంఖ్య  లో వీడియోలు అటు యూట్యూబ్ లో అప్ లోడ్ అవుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే.

అయితే యూట్యూబ్ లో మొట్ట మొదట అప్లోడ్ అయిన వీడియో ఏమిటి అనేది మాత్రం చాలా  మందికి తెలియదు. 2005 ఫిబ్రవరి 14వ తేదీన యూట్యూబ్ లాంచ్ అయ్యింది. ఇలా యూట్యూబ్ లాంచ్ అయిన పది రోజులకు సహవ్యవస్థాపకుడు జావేద్ కరీం కాలిఫోర్నియా లోని జూ ఎన్ క్లో్సర్ లో ఏనుగు దగ్గర వీడియో తీసుకుని  2005 ఏప్రిల్ 24వ తేదీన మొదటి వీడియో అప్లోడ్ చేశారు. అయితే అదే ఆయన మొదటి చివరి వీడియో కూడా కావడం గమనార్హం. ఇప్పుడు యూట్యూబ్ నడిపిస్తున్న హవా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: