జీవితంలో ఒకేసారి స్నానం.. ఆ తెగ సాంప్రదాయం తెలుసా?

praveen
రోజు ఎంతో ఫ్రెష్ గా ఉండాలి అంటే తప్పకుండా ప్రతిరోజూ స్నానం చేయాల్సిందే. ఇలా స్నానం చేయకపోతే ఎంతో ఇబ్బందిగా ఫీలవుతుంటారు చాలామంది. కానీ కొంతమంది మాత్రం రోజు కాకుండా రెండు రోజులకొకసారి స్నానం చేసే వాళ్లు కూడా ఉంటారు. పర్ఫ్యూమ్ తో మేనేజ్ చేస్తూ ఉంటారు అని చెప్పాలి. కానీ జీవితంలో కేవలం ఒకే ఒక్క సారి స్నానం చేసే వారి గురించి మీకు తెలుసా. జీవితంలో ఒకే సారి స్నానం చేయడమా.. వామ్మో అలా ఉండగలరా బాసు ఎవరైనా. అలా ఉండడం దాదాపు అసాధ్యం అని చెబుతూ ఉంటారు అందరు.

 కానీ ఇక్కడ ఒక తెగ మాత్రం ఇలాగే జీవితంలో కేవలం ఒక్కసారి మాత్రమే స్నానం చేస్తారట. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ప్రస్తుతం ప్రపంచం మొత్తం టెక్నాలజీ వెంట పరుగులు పెడుతుంటే.. ఇంకా అడవుల్లో ఉండే కొన్ని తెగల వారు మాత్రం నాగరికత లోకి అడుగు పెట్టకుండా వారి పాత జీవనశైలిలోని జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఇలాంటి తెగలు ప్రపంచవ్యాప్తంగా చాలానే ఉన్నాయి అని చెప్పాలి. ఇక ఇలాంటి తెగలకు సంబంధించి కొన్ని ఆచారాలు సాంప్రదాయాలు అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే హింబా తెగ ప్రజలు ఏకంగా జీవితంలో ఒకే సారి స్నానం చేస్తారట.

 నమీబియాలోని కున్నాయిన్ ప్రావిన్స్ లో హింబా తెగ ప్రజలు ఉంటారు. అయితే ఈ తెగ వారు కేవలం పెళ్లి చేసుకున్నప్పుడు మాత్రమే స్నానం చేస్తారట. అంతేకాదు బట్టలు కూడా ఉతకరట. మరి స్నానం చేయకుండా ఎలా దుర్వాసన వస్తుంది కదా.. ఆ కంపు ఎలా భరిస్తారు అని అనుకుంటున్నారు కదా.. ప్రత్యేకమైన మూలికలను మరిగించి ఇక ఆవిరితో  శరీరాన్ని ఎప్పుడూ తాజాగా ఉంచుకుంటారట. ఈ తెగవారు పెళ్లి అయింది అన్న దానికి గుర్తుగా పురుషుల తలపాగాను తలపై ధరిస్తారట. ఇక ఎప్పటికీ కూడా ఈ తలపాగాలు పక్కకు పెట్టారట. ఏది ఏమైనా ఈ తెగ అలవాటు మాత్రం కాస్త విచిత్రంగానే ఉన్నాయి కదా..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: