మా జోలికొస్తే.. తాట తీస్తాం.. చైనాకు వార్నింగ్?

praveen
చిన్న దేశమైన తైవాన్ ను తమ దేశంలో కలుపుకునేందుకు చైనా ఎన్నో కుట్రలు పన్నుతూ  ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఎన్నో ఏళ్ల నుంచి ఇక తైవాన్ ను చైనాలో కలుపుకోవడానికి  చైనా  చేయని ప్రయత్నమంటూ లేదు అని చెప్పాలి. కానీ ప్రపంచ దేశాలు చైనా కు అడ్డుపడుతున్న  నేపథ్యంలో ఇప్పటి వరకు వెనక అడుగు వేస్తూ వచ్చింది  చైనా. కానీ గత కొంత కాలం నుంచి మాత్రం సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు సృష్టిస్తూ వస్తుంది చైనా. అంతేకాకుండా తైవాన్ గగనతలంలో కి యుద్ధ విమానాలను కూడా పంపిస్తూ పరిస్థితులు తీవ్రమైన పరిణామాలకు దారితీసే విధంగా వ్యవహరిస్తోంది అనే విషయం తెలిసిందే.

 అదే సమయంలో గతంలో ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చైనా  తీరును తీవ్రంగా ఖండించారు. తైవాన్ స్వతంత్ర దేశంగా గుర్తిస్తామని..  తైవాన్ చైనా లో భాగం కాదని.. తైవాన్ జోలికి వస్తే ఊరుకోమని హెచ్చరించారు. ఇక ఇప్పుడు  బైడెన్ కూడా తైవాన్ కు అండగా నిలబడి తామూ అంటూ హామీ ఇస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో అతి చిన్న దేశం అయినప్పటికీ తైవాన్  కూడా చైనాకు వరుసగా వార్నింగ్ ఇస్తూనే ఉంది.

 స్వతంత్ర దేశంగా ఉండేందుకు సిద్ధంగా ఉన్నామని.. తమ సార్వభౌమత్వాన్ని ఎవరి దగ్గర తాకట్టు పెట్టేందుకు సిద్ధంగా లేమని ఒకవేళ తమ దేశం జోలికి వస్తే ప్రాణాలకు తెగించి పోరాటానికి  రెడీ గా ఉన్నాం అంటూ హెచ్చరించింది. ఇక ఇప్పుడు మరోసారి చైనాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది తైవాన్.  గత ఏడాది కాలంలో 30 సార్లు చైనా కు సంబంధించిన యుద్ధ విమానాలు తైవాన్ గగనతలంలో కి వచ్చాయి. యాంటీ సబ్ మెరైన్ లు కూడా మా గగనతలంలోకి వచ్చాయి. ఇక ప్రతిసారి మిలటరీ డ్రిల్స్ అంటూ చైనా చెబుతుంది. తాము ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సిద్ధంగా ఉన్నాం.. తమ సైన్యాన్ని సన్నద్ధం చేసుకున్నాము.. అమెరికాతో మిలటరీ ఒప్పందం కుదుర్చుకున్నామని.. తమ జోలికి వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని అంటూ వార్నింగ్ ఇచ్చింది తైవాన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: