103 ఏళ్ళ బామ్మ గిన్నిస్ రికార్డ్.. ఏం చేసిందో తెలుసా?

praveen
సాధారణంగా యూత్ అందరూ కూడా ఒక్కసారైనా జీవితంలో పారాచూట్ జంప్ చేయాలని ఎంతో మంది భావిస్తూ ఉంటారు. ఇక పారాచూట్ అంటే ఎక్కడ పడితే అక్కడ అందుబాటులో ఉండదు కదా.. దీని కోసం ప్రత్యేకమైన పర్యాటక ప్రాంతాలకు వెళ్లాల్సిందే. ఇక డబ్బులు ఉన్నవాళ్లు అయితే ఎప్పుడంటే అప్పుడు వెళ్ళి పోతూ ఉంటారు. కానీ సామాన్యులు ఇలాంటి పారాచూట్ జంప్ చేయాలానే  కోరికలు తీర్చుకునేందుకు కాస్త సమయం సందర్భం చూసుకుని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారు లేదా వయసుమీద పడిన వారు పారాచూట్ జంపింగ్ కి  కాస్త దూరంగానే ఉంటారు.

 ఎందుకంటే భారీ ఎత్తున నుంచి పారాచూట్ జంప్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఒక వేళ భయపడితే చివరికి ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది అని భావిస్తూ ఉంటారు. యువత మాత్రం పోటీ పడి మరీ పారాచూట్ జంపింగ్ చేస్తూ ఇక గాల్లో తేలి పోవడాన్ని ఎంతగానో ఆస్వాదిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల కాలంలో సెలబ్రిటీలు సైతం టూర్ లో కి వెళ్ళినప్పుడు పారాషూట్   జంపింగ్  చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. కానీ ఇక్కడ ఒక 103 ఏళ్ల బామ్మ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.

 సాధారణంగా 103 ఏళ్ల వయస్సులో వృద్ధులు ఎవరైనా సరే మనవళ్లు మనవరాళ్లతో ఆడుకుంటూ కృష్ణ రామ అంటూ హాయిగా ఇంట్లో రెస్టు తీసుకుంటారు.. కానీ స్వీడన్కు చెందిన 103 ఏళ్ల వృద్ధురాలు రూట్ లార్సన్ మాత్రం సాహసం చేసింది.  పారాచూట్ జంపింగ్ చేసి గిన్నిస్ రికార్డును సొంతం చేసుకోవడం గమనార్హం. ఇక ప్రపంచంలో టాండన్ పారాచూట్ జంపు చేసిన అతి పెద్ద వయసు కలిగిన వ్యక్తిగా ఈమె రికార్డు సృష్టించింది. చేయాలన్న తపన ఉత్సాహం ఉంటే ఏదైనా సాధ్యం అవుతుంది అన్న దానికి నిదర్శనం గా మారిపోయింది అని చెప్పాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: