పిల్లిని పెళ్లి చేసుకున్న మహిళా.. ఎక్కడో తెలుసా?

praveen
ఇటీవల కాలంలో మనుషులు సాటి మనుషుల మీద ప్రేమ చూపించలేకపోతున్నారు. ప్రతి ఒక్కరిలో మానవత్వం కనుమరుగయ్యి కుళ్ళు కుతంత్రాలతో నిండిన ఆలోచనలే కనిపిస్తున్న నేపథ్యంలో నేటి రోజుల్లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే సొంత వాళ్లు అనుకున్నవాళ్లే చివరికి నట్టేట్లో ముంచేస్తున్న ఘటనలు నేటి సమాజంలో నెలకొన్నాయ్. ఇలాంటి నేపథ్యంలో మనుషులను నమ్మి మోసపోవడం కంటే జంతువుల పై అదే ప్రేమగా చూపిస్తే విశ్వాసం గా ఉంటాయి అని నమ్ముతున్నారు ఎంతో మంది.

 ఈ క్రమంలోనే తమకిష్టమైన జంతువులను తెచ్చుకొని పెంచుకుంటూ ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. మనిషి మీద చూపించిన ప్రేమ కంటే జంతువుల మీద ప్రేమ చూపిస్తూ ఉన్నారు. ఇక్కడ ఓ మహిళ ఏకంగా తన పెంపుడు జంతువునే పెళ్లి చేసుకుంది  ఇది కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇటీవలి కాలంలో ఎంతో మంది యువతులు పెళ్లిపై విరక్తితో తమని తామే పెళ్లిచేసుకున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఏకంగా ఒక మహిళ అయితే తన పెంపుడు జంతువైన పిల్లిని పెళ్లి చేసుకుంది.

 లండన్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 49 ఏళ్ల డాబోరా హాడ్జ్ అనే మహిళ ఇండియా అనే పిల్లిని పెళ్లాడింది. ఇదేమిటని అడిగితే.. మా ప్రాంతంలోని ఇళ్లలో పెంపుడు జంతువులకు అనుమతి లభించదు. దీంతో పెంపుడు జంతువులను వదిలేయాల్సి వస్తుంది. నాకు ఇండియా అంటే ప్రాణం. దాన్ని పెళ్లి చేసుకోవడం ద్వారా మేము అందరం ఒక ఫ్యామిలీ కిందికి వస్తాము. అప్పుడు మమ్మల్ని విడదీయడం ఎవరి వల్ల కుదరదు. నా  పిల్లలు నాకు ఎంత ముఖ్యమో ఇండియా కూడా నాకు అంతే ముఖ్యం అంటూ సదరు మహిళ చెప్పడం గమనార్హం. ఏదేమైనా మహిళ పిల్లని పెళ్ళి చేసుకోవడం మాత్రం హాట్ టాపిక్ గా మారింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: