కోట్లకు అధిపతులు.. బ్రెడ్ ముక్క కోసం ఆర్తనాదాలు?

praveen
మొన్నటి వరకు ప్రపంచ దేశాలలో కరోనా వైరస్ అల్లకల్లోల పరిస్థితులను సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు ప్రతి ఒక్కరు ఈ మహమ్మారి వైరస్ బాధితులు గానే మిగిలిపోయారు. ఏకంగా మూడు దశల పాటు విజృంభించిన కరోనా వైరస్ మారణహోమం సృష్టించింది. ఎన్నో దేశాలను సంక్షోభంలోకి నెట్టింది. ఇక చిన్న దేశాలు అయితే తీవ్ర స్థాయిలో ఆర్థిక ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొన్న పరిస్థితి కూడా ఉంది. మొన్నటి వరకు ప్రపంచ దేశాలలో ప్రాణాలు తీస్తూ అల్లకల్లోల పరిస్థితులు సృష్టించిన కరోనా వైరస్ ఎప్పుడు పుట్టినిల్లు అయిన చైనాలో విజృంభిస్తుంది.

 కొంతకాలం నుంచి చైనాలో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరిగిపోతున్న తీరు చూస్తూ ఉంటా ప్రతి ఒక్కరూ భయాందోళనలో మునిగి పోవాల్సిన  పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ముఖ్యంగా చైనా లోని వాణిజ్య రాజధానిగా పేరున షాంగై నగరంలో  దేశంలోని 70 శాతం కరోనా కేసులు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో అక్కడ లాక్డౌన్ విధించింది ప్రభుత్వం. ఎవరు కూడా గడప దాటి కాలు బయట పెట్టడానికి వీలు లేదు అంటూ కఠిన ఆంక్షలు అమలు చేస్తుంది. నిత్యావసర సరుకులు తెచ్చుకునేందుకు కూడా అవకాశం లేదు అని చెబుతోంది. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరిస్తోంది.

 దీంతో ప్రతి ఒక్కరు ఇంటికే పరిమితం అవుతున్న పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సమయంలోనే కనీసం ఆహార సరఫరా కూడా చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది ప్రభుత్వం. దీంతో ఇక ఎంతో మంది ప్రజలు ఆకలితో అలమటించి పోతున్నారు అన్నది అర్ధమవుతుంది. ఇక కోట్లకు అధిపతులు గా ఉన్నవారు సైతం ప్రస్తుతం కనీసం బ్రెడ్ ముక్క కూడా దొరకకా ఆర్తనాదాలు చేస్తున్న దుస్థితి చైనాలోని షాంగై నగరంలో ఏర్పడింది. తమకు కాస్త ఆహారం ఇచ్చి ప్రాణాలు కాపాడాలి అంటూ కోటీశ్వరులు సైతం ఇక తమ ఇళ్ల కిటికీల నుండి  ఆర్తనాదాలు చేస్తూ ఉన్న పరిస్థితి ప్రస్తుతం చైనాలోని షాంగై నగరంలో నెలకొంది?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: