షాకింగ్ : ప్రధానమంత్రికి జరిమానా?

praveen
చైనాలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి అల్లకల్లోల పరిస్థితుల సృష్టించిందో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రోజురోజుకీ శర వేగంగా వ్యాప్తి చెందుతూ అన్ని దేశాల్లో సంక్షోభానికి కారణమైంది. ముఖ్యంగా అగ్ర దేశాలలో అయితే కరోనా వైరస్ మహమ్మారి చేసిన విలయ తాండవం అంతా ఇంతా కాదు అని చెప్పాలి. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అన్ని దేశాల్లో కూడా కఠిన ఆంక్షలు విధించారు. ప్రతి ఒక్కరూ కరోనా వైరస్ నిబంధనలు పాటించడమే కాకుండా ఇంటి నుంచి బయటికి వచ్చేందుకు కూడా వీలు లేదు అంటూ లాక్డౌన్ విధించిన పరిస్థితులు కూడా వచ్చాయి.

 అయితే సాధారణంగా ఇలా ప్రభుత్వాలు లాక్ డౌన్  విధించిన సమయంలో ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అలాంటిది ఏకంగా దేశ వ్యాప్తంగా కఠిన నిబంధనలు విధించిన ప్రధానమంత్రి నిబంధనలు ఉల్లంఘించి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అదే హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది.. ఇదిఇక్కడ ఇలాంటిదే జరిగింది.  బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ నిబంధనలు ఉల్లంఘించి ఏకంగా ఎంతోమంది జనాల మధ్య పార్టీలు చేసుకోవడం చేశారు. ఇది కాస్త ఎంత సంచలనంగా మారిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

 ఈ క్రమంలోనే ఈ ఘటనపై విచారణ జరపగా రూల్స్ ఉల్లంఘించి విందులో పాల్గొన్న బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ఆయన భార్య క్యారీ, ఆర్థికమంత్రి రిషి సునక్ లకు అక్కడి పోలీసులు జరిమానా విధించారు. ఈ మేరకు జరిమానా చెల్లించాలంటూ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఎంత మొత్తంలో జరిమానా విధించారు అన్న విషయాలు మాత్రం ఇప్పటి వరకు బయటకు రాలేదు. ఇలా చట్టాన్ని ఉల్లంఘించి నందుకు ప్రపంచంలోనే జరిమాన పడిన మొదటి ప్రధానమంత్రిగా బోరిస్ జాన్సన్ నిలిచారు. అయితే బోరిస్ జాన్సన్ దీనికి బాధ్యత వహిస్తూ వెంటనే ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: