అతనికి నేను క్షమాపణ చెప్పడమేంటి : బైడెన్

praveen
ప్రస్తుతం రష్యా అధ్యక్షుడు పుతిన్ తీరుపై ప్రపంచ దేశాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రశాంతంగా ఉన్న సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు సృష్టించడమే కాదు చిన్న దేశమైన ఉక్రెయిన్ పై ఏకంగా యుద్ధం ప్రకటించడం కూడా సంచలనంగా మారిపోయింది. అయితే ఇక ఈ యుద్ధం మొదలు పెట్టి దాదాపు ముప్పై మూడు రోజులు గడిచిపోతున్నాయి. అయినప్పటికీ పరిస్థితుల్లో మాత్రం మార్పు రావడం లేదు. రోజురోజుకీ రష్యన్ సేనల దాడులతో అటు ఉక్రెయిన్లో అల్లకల్లోల పరిస్థితులు నెలకొని ఉన్నాయి అని చెప్పాలి.

 అటు సైనికులతో పాటు సాధారణ పౌరులు కూడా వేల మంది ప్రాణాలు కోల్పోతున్న దుస్థితి. ఇదంతా చూస్తూ ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే రష్యా ఉక్రెయిన్ పై యుద్ధం పేరుతో విరుచుకు పడుతున్న నేపథ్యంలో ప్రపంచ రష్యా అధ్యక్షుడు పుతిన్ పై విమర్శలు గుప్పిస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. అగ్ర దేశమైన అమెరికా అయితే ఎన్ని రకాల ఆంక్షలు విధించాలో అన్ని రకాల ఆంక్షలు విధించి రష్యాను ఇబ్బందులకు గురి చేస్తోంది. అదే సమయంలో ఇక రష్యా అధ్యక్షుడు పుతిన్ పై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా చేస్తున్నారు. ఇటీవలే రష్యాలో అధికార మార్పు జరగాలి అంటూ అమెరికా అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు సంచలనం గా మారిపోయాయి.

 ఇక తాజాగా ఇదే విషయంపై జో బైడెన్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రష్యా అధ్యక్షుడిగా ఉన్న పుతిన్ అధికారంలో కొనసాగకూడదు అని తాను చేసిన వ్యాఖ్యలు కేవలం నైతిక ఆగ్రహం మాత్రమే అంటూ వివరణ ఇచ్చారు జో బైడెన్.  రాజకీయాల్లో అధికార మార్పిడి విధానం మా ఉద్దేశం కాదని  స్పష్టం చేశారు జో బైడెన్.  ఇటీవలే పోలాండ్ పర్యటనలో భాగంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ కసాయి అని  అతను అధికారంలో ఉండకూడదు అంటూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారగా ఈ మేరకు వివరణ ఇచ్చారు జో బైడెన్. అంతేకాకుండా తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోనని అంతేకాకుండా పుతిన్ లు క్షమాపణలు చెప్పను అంటూ జో బైడెన్ స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: