మూడో ప్రపంచ యుద్ధం తప్పదు : జెలెన్ స్కీ

frame మూడో ప్రపంచ యుద్ధం తప్పదు : జెలెన్ స్కీ

praveen
పసికూన లాంటి ఉక్రెయిన్ పై అగ్రరాజ్యమైన రష్యా యుద్ధానికి దిగుతూ భీకర దాడులకు పాల్పడుతూ ఉండటం జనావాసాల పై కూడా బాంబుల వర్షం కురిపిస్తూ మారణహోమానికి కారణం అవుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం మొత్తం ప్రస్తుతం రష్యా అధ్యక్షుడు పుతిన్ తీరును వ్యతిరేకిస్తూ వస్తోంది. అదే సమయంలో హీరోయిజం చూపిస్తున్నట్లుగా రష్యాను అంతకంతకూ రెచ్చగొడుతూ ఉక్రెయిన్ ప్రజల ప్రాణాలను రిస్క్ లో పెడుతున్నా ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్ స్కీ ని సైతం అదే స్థాయిలో విమర్శలు చేస్తూ ఉండటం గమనార్హం. ఇక ఈ రెండు దేశాల మధ్య యుద్ధం ప్రారంభం అయ్యి రెండు వారాలు గడుస్తున్నా ఇప్పటికీ యుద్ధం సద్దుమణిగే పరిస్థితులు మాత్రం కనిపించడం లేదు.


 ఇకపోతే ఇటీవల ఒక అంతర్జాతీయ మీడియా సంస్థ తో మాట్లాడిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ..  మరోసారి పుతిన్ తో శాంతి చర్చల గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్  తో చర్చలకు తాను సిద్ధంగా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చారు. ఒకవేళ ఇప్పుడు జరిగిన శాంతి చర్చలు గనుక విఫలం అయితే ఇక ఆ తర్వాత పరిణామాలు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం ఉంది అని ఆందోళన వ్యక్తం చేశారు.  ఇప్పుడు కాదు దాదాపు గత రెండేళ్ల నుంచి పుతిన్ తో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నానని.. సంధితో కాకుండా మరో మార్గంలో యుద్ధం ముగుస్తుంది అని నేను  అనుకోవడం లేదు అంటూ చెప్పుకొచ్చాడు.


 ఇక రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ఏ దోవలో చర్చలు జరిగినా పర్వాలేదు కానీ ఆయనతో మాట్లాడటం మాత్రం ఖచ్చితంగా జరగాలని కోరుకుంటున్నాను అంటూ వ్యాఖ్యానించాడు. మొత్తం ఇక అదే సమయంలో ఇక యుద్ధం గురించి మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు స్పందించేందుకు విముఖత వ్యక్తం చేయడం గమనార్హం. ఇకపోతే ప్రస్తుతం ఉక్రెయిన్ లో రోజురోజుకీ సైనికులతో పాటు సాధారణ పౌరులు కూడా వందల సంఖ్యలో చనిపోతూన్న నేపథ్యంలో ఇక అక్కడ నెలకొన్న పరిస్థితులపై ప్రపంచ దేశాలు మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: