యుద్ధం : ఉక్రెయిన్ కు సహాయం చేస్తామన్న భారత్?

praveen
అగ్రరాజ్యమైన రష్యా పసికూన లాంటి ఉక్రెయిన్ పై చేస్తున్న యుద్ధం నానాటికీ తీవ్ర రూపం దాలుస్తుంది తప్ప ఎక్కడ తగ్గుముఖం పడుతున్నట్లు మాత్రం కనిపించడం లేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  రష్యా ఉక్రెయిన్ పై యుద్ధం మొదలుపెట్టి దాదాపు ఏకంగా రెండు వారాలు గడిచిపోతుంది. అయినప్పటికీ పరిస్థితుల్లో మాత్రం ఎక్కడా మార్పు లేదు. రష్యా సైన్యం ఎక్కడ మానవత్వాన్ని చూపించకుండా అటు ఉక్రెయిన్ పై భీకర రీతిలో దాడులకు పాల్పడుతోంది.  అదే సమయంలో అటు ఉక్రెయిన్ సైన్యం రష్యాను ఎదుర్కొనేందుకు వీరోచితంగా పోరాటం చేస్తుంది అని చెప్పాలి. ఇక రష్యా సేనలు అటు జనావాసాల పై కూడా దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో ఎంతో మంది సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోతున్న దుస్థితి ఏర్పడింది.

 ఇప్పటికే ఉక్రెయిన్లో ఏకంగా వందల మంది సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ లో అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. ఇక ఉక్రెయిన్ లో నెలకొన్న పరిస్థితులపై స్పందిస్తున్న ప్రపంచ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే మొన్నటి వరకూ ఉక్రెయిన్ రష్యా మధ్య తలెత్తిన యుద్ధం విషయంలో తటస్థ ధోరణి వ్యవహరించిన భారత్ ఇప్పుడు ఉక్రెయిన్ కి మద్దతు ఇచ్చేందుకు సిద్ధమైంది అన్నది తెలుస్తుంది. ఉక్రెయిన్ లో నెలకొన్న పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసిన భారత్ అక్కడ నెలకొన్న మానవ సంక్షోభంపై తక్షణం చర్యలు తీసుకోవాల్సిన అవసరం అన్ని దేశాలకు ఉందని అభిప్రాయం వ్యక్తం చేసింది.

 ఇక రానున్న రోజుల్లో ఉక్రెయిన్ కు మరింత సహాయం చేస్తాము అంటూ ఐక్యరాజ్యసమితి సమావేశంలో  భారత రాయబారి తెలపడం గమనార్హం. ఇక ఉక్రెయిన్ సంక్షోభాన్ని నివారించేందుకు పలు దేశాల విన్నపం మేరకు ఇటీవల ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అత్యవసర సమావేశం నిర్వహించగా... ఈ సమావేశంలో భారత్ కూడా పాల్గొంది. ఇక భారత రాయబారి తిరుమూర్తి మాట్లాడుతూ యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి పరిస్థితులు దిగజారుతున్నాయని.. వేలాది మంది ప్రాణాలు కోల్పోగా లక్షలాది మంది ఇతర దేశాలకు వలస వెళుతున్నారు అంటూ చెప్పుకొచ్చారు. ఇక దేశంలోని మానవత పరిస్థితులపై భారత్ ఆవేదన వ్యక్తం చేస్తోందని చెప్పుకొచ్చారు ఆయన. ఇక ప్రతి దేశం కూడా ఉక్రెయిన్ పౌరులకు మానవతా దృక్పథంతో సహాయం చేయాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. ఇక రష్యా ఉక్రెయిన్ దౌత్య విధానాల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు.  అంతకు మించి మరో మార్గం లేదు అంటూ సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: