రష్యా యుద్ధం : ఉక్రెయిన్లో గుట్టలుగా శవాలు?
దీంతో ఇక రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధమే ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఉక్రెయిన్ లో ఉన్న ప్రధాన నగరాలతో పాటు రష్యా సేనలు విచక్షణారహితంగా బాంబుల వర్షం కురిపిస్తూ దాడులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. ఇక ప్రజలు నివాసముండే పెద్ద పెద్ద భవనాలు ని టార్గెట్ గా చేసుకుని దాడులకు తెగబడుతు మారణహోమం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఉక్రెయిన్లో వెలుగులోకి వస్తున్న దృశ్యాలు హృదయవిదారకంగా మారిపోతున్నాయి అని చెప్పాలి. ఇటీవలే ఉక్రెయిన్ లో ఉన్న కీలకమైన నగరం అయినటువంటి మేరియు పోల్ లో కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి.
ఇక రష్యా విధ్వంసకాండ లో ఇప్పటివరకు ఏకంగా 2500 మంది మరణించినట్లు ఉక్రెయిన్ అధ్యక్ష సలహాదారు హెఫ్లెక్సీ వెల్లడించారు. మెరియు పోల్ కి చేరుకొనే మానవతా సహాయాన్ని కూడా రష్యా అడ్డుకుంటుంది అంటూ ఇటీవలే ఆవేదన వ్యక్తం చేశారు ఆయన. గడిచిన రెండు రోజుల వ్యవధిలోనే మరణాల సంఖ్య భారీగా పెరిగింది అంటూ చెప్పుకొచ్చారు. మొత్తంగా యుద్ధం మొదలైన నాటి నుంచి 12 రోజుల్లో 1500 సాధారణ పౌరులు మృత్యువాత పడినట్లు తెలిపిన ఆయన కేవలం రెండు రోజుల వ్యవధిలోనే 1000 మంది చనిపోయారు అనే విషయాన్ని చెప్పుకొచ్చారు. ఇక అందరి మృతదేహాలను గుట్టలుగా చేర్చి సామూహిక అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.