అత్యంత వృద్ధ జంట.. ఎన్నో పెళ్లి రోజు జరుపుకుంటున్నారో తెలుసా?

praveen
వివాహాలు స్వర్గంలో నిర్ణయించబడతాయి అని చెబుతూ ఉంటారు. దానికి అనుగుణంగానే భూమి మీద మనుషులు ఉంటారు. ఒకప్పుడు భార్య భర్తల మధ్య వైవాహిక బంధం అనుబంధం చూసిన తర్వాత ఇది నిజమే అనిపించేది కానీ నేటి రోజుల్లో మాత్రం పెళ్లి అనేది కేవలం మూన్నాళ్ళ ముచ్చట లాగానే మారిపోయింది అని చెప్పాలి. ఎందుకంటే ఇటీవల కాలంలో పెళ్లి చేసుకున్నా నెలల వ్యవధిలోనే మళ్లీ విడాకులు కావాలంటూ కోర్టులను ఆశ్రయిస్తున్న వారు ఎక్కువగా కనిపిస్తున్నారు. మరి కొంతమంది సంవత్సరాల పాటు కలిసి ఉండి చివరికి భాగస్వామితో జీవితాన్ని పంచుకోలేము అంటూ  వైవాహిక బంధానికి తెగదెంపులు చేసుకున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ఇదే జరుగుతూ వస్తోంది.



 అయితే ఇలా నేటి రోజుల్లో పెళ్లిళ్లు చేసుకుంటున్న వారు నెలల వ్యవధిలోనే విడిపోతూ ఉంటే ఒకప్పుడు పెళ్లి చేసుకున్న వారు మాత్రం ఇప్పటికీ అన్యోన్యమైన దంపతులుగా కొనసాగుతూ అందరిని ఆశ్చర్యానికి గురి చేయడమే ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఒక వృద్ధ జంట వివాహ వార్షికోత్సవం జరుపుకుంటు అందరికీ ఆదర్శంగా నిలిచింది.  ఎందుకంటే ఏకంగా ఆ వృద్ధ జంట 90వ పెళ్లి రోజును జరుపుకోవడం గమనార్హం. ఓరి నాయనో తొంభయ్యవ పెళ్లిరోజు అంటే మరి వాళ్ళ వయసు ఎంత ఉంది అని అనుకుంటున్నారు కదా.


 ఏకంగా అతని వయసు 109 ఏళ్ళు.. మహిళ వయసు 108 ఏళ్ళు. ఇటీవల 90 పెళ్లిరోజు ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ఇద్దరు మోడరన్ దుస్తుల్లో కనిపిస్తూ  సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయారు. ఇంకా యూత్ అన్న విధంగానే తమ పెళ్లి రోజును సెలబ్రేట్ చేసుకుంటున్నారు. 90 ఏళ్ల దాంపత్య జీవితంలో ఉన్న మధురానుభూతులను నెమరు వేసుకుంటూ ఫోటోలకి ఫోజులు ఇస్తున్నారు ఈ వృద్ధ జంట. వీరి 90వ పెళ్లిరోజు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోవడం అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: