రష్యాకు షాక్.. చేతుల్లోనే పేలుస్తున్న ఉక్రెయిన్ సైన్యం?
అయినప్పటికీ రష్యాతో ఉక్రెయిన్ ఎలా వీరోచితంగా పోరాటం చేయగలుగుతుంది.. రష్యా యుద్ధ విమానాలను ఎలా నివారించగలుగుతుంది అన్నది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన అంశం. యుద్ధ విమానాలను కూల్చివేశాము అంటూ ప్రతి రోజు ఉక్రెయిన్ రక్షణశాఖ స్టేట్మెంట్లు ఇస్తూ ఉండడం గమనార్హం. ఇలాంటి సమయంలో ఇదంతా ఎలా చేయగలుగుతుంది అన్నది ప్రస్తుతం తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. అయితే ఉక్రెయిన్ రష్యాతో ఎంతో సమర్ధవంతంగా యుద్ధం చేయడం వెనక యుద్ధ విమానాలను కూల్చేయడం వెనుక అమెరికా ఇచ్చిన ఆయుధాలు ఉన్నాయి అన్నది తెలుస్తుంది.
అయితే ఉక్రెయిన్ కి ఏ మాత్రం ఆయుధ సహకారం అందించిన ఆ దేశాలు కూడా మాకు శత్రుదేశాల గా పరిగణిస్తాము అంటూ రష్యా ప్రకటించిన నేపథ్యంలో వెనకడుగు వేస్తున్నాయి నాటో దేశాలు. ఇలాంటి సమయంలో భుజాల మీద పెట్టుకొని పెల్చుతూ విధ్వంసం సృష్టించేటువంటి మాన్యువల్ ఎయిర్ డిఫెన్స్ ని ప్రస్తుతం ఉక్రెయిన్ కు అమెరికా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవలే ఉక్రెయిన్ రాజధాని కీవ్ దగ్గర ప్రయాణిస్తూ వంటి రష్యా హెలికాప్టర్ కేఏ -15 ను ఈ మాన్యువల్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ ఆయుధాలతో నే ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. ఇక ఇలా అమెరికా అందించిన ఈ ఆయుధాలతో రష్యా యుద్ధ విమానాలు హెలికాప్టర్లను ఉక్రెయిన్ సైన్యం సమర్థవంతంగా కూల్చ కలుగుతుంది అన్న విషయం ఇటీవల బయటపడింది..