రష్యా యుద్ధం.. జెలెన్ స్కీపై మూడుసార్లు హత్యయత్నం?

praveen
రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం రోజుకు తీవ్రరూపం దాలుస్తోంది తప్ప ఎక్కడా తగ్గుముఖం పట్టినట్లు మాత్రం కనిపించడం లేదు. చిన్న దేశమైన ఉక్రెయిన్ పై అటు రష్యా తీవ్రస్థాయిలో విరుచుకు పడుతు యుద్ధం చేస్తూ ఉన్నప్పటికీ ఉక్రెయిన్ మాత్రం రష్యాకు లొంగిపోవడానికి ఎక్కడ ఇష్టపడటంలేదు. ఈ క్రమంలో తక్కువ మంది సైన్య ఉన్నప్పటికీ అటు ఉక్రెయిన్ సైనికులతో వీరోచితంగా పోరాటం చేస్తున్నారు. ఇప్పటికే ఇరు దేశాల మధ్య పలుమార్లు శాంతి చర్చలు జరిగినప్పటికీ విఫలమవుతూనే ఉన్నాయి.

 ఈ క్రమంలోనే ఇక అటు ఉక్రెయిన్ రష్యా మధ్య జరుగుతున్న యుద్ధంతో అటు ప్రపంచ దేశాలు మొత్తం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఒకవైపు రష్యా సేనలు ఒకవైపు చొచ్చుకు వస్తూ ఉన్నప్పటికీ ఎక్కడ భయపడకుండా ధైర్యాన్ని నింపుతూన్నారు. ఈ క్రమంలోనే ఇక వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు అంటూ ఆదేశాలు జారీ చేస్తున్నారు. అయితే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ నీ హతమార్చేందుకు రష్యా ప్రైవేటు సైన్యంను రంగంలోకి  దింపింది అంటూ గత కొన్ని రోజుల నుంచి టాక్ వినిపిస్తోంది. ఇలాంటి సమయంలో ఇటీవలే అమెరికా విదేశాంగ శాఖ మంత్రి చేసిన ఆంటోనీ వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.

 ఇటీవలే అమెరికా చట్టసభ తో మాట్లాడిన జెలెన్ స్కీ  నన్ను సజీవంగా చూడడం ఇదే చివరి సారి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇది నిజమా కాదా అంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలోఅడగగా.. షాకింగ్ విషయాలను బయటపెట్టారు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి. ఒకవేళ జెలెన్ స్కీనీ రష్యా అంతం చేస్తే అత్యవసర ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. వాటి గురించి ఇప్పుడు మాట్లాడాలని అనుకోవడం లేదు అంటూ చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు  జెలెన్ స్కీ పై మూడు హత్యాప్రయత్నాలు జరిగాయి. జెలెన్ స్కీ  ప్రభుత్వం ఎంతో గొప్పగా పని చేస్తూ రష్యాపై వీరోచితంగా పోరాటం చేస్తోంది అంటూ ఆయన చెప్పుకొచ్చారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: