ప్లీస్ యుద్ధం ఆపండి.. టెన్నిస్ ప్లేయర్ రిక్వెస్ట్?

praveen
పసి కూన లాంటి ఉక్రెయిన్ పై రష్యా చూపిస్తున్న బలప్రదర్శన ఏ రేంజిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బాంబు దాడులు వైమానిక దాడులతో రష్యా ఉక్రెయిన్ పై విజృంభిస్తుంది.  చిన్న దేశం అని చూడకుండా అగ్రరాజ్యమైన రష్యా ఉక్రెయిన్ దాడి చేస్తున్న తీరు ప్రపంచ దేశాలను భయాందోళనకు గురి చేసిందని చెప్పాలి. కాగా రష్యా మధ్య తలెత్తిన యుద్ధం ఎక్కడ వరకు దారి తీస్తుందో అన్నది కూడా ఊహకందని విధంగా ఉంది. ఒకవేళ ఉక్రెయిన్ మద్దతుగా నాటో యూరోపియన్ యూనియన్ దళాలు రంగంలోకి దిగితే ఈ రెండు దేశాల మధ్య యుద్ధం  మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం ఉంది అని రక్షణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.

 అయితే రష్యా చేస్తున్న మారణహోమాన్ని ఆపాలంటూ ప్రపంచ దేశాలు విజ్ఞప్తి చేసినప్పటికీ అటు రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ మనసు మాత్రం మారడం లేదు అన్నది తెలుస్తుంది. అయితే రష్యా అధ్యక్షుడిగా ఉన్న పుతిన్  తీరుకు నిరసనగా అటు ఉక్రెయిన్ లోనే కాదు సొంత దేశమైన రష్యాలో కూడా ఎంతో మంది పౌరులు నిరసన వ్యక్తం చేస్తూ యుద్ధం ఆపాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక ఇటీవలే ఏకంగా 1700 మంది పౌరులు యుద్ధం ఆపాలంటూ నిరసన వ్యక్తం చేయగా వారిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఇక ఇప్పుడు రష్యాకు చెందిన టెన్నిస్ ఆటగాడు ఆండ్రి రబ్లేన్ సైతం ఘాటుగానే స్పందించారు.

 ఎంత ఘాటుగా అంటే ఇటీవలే దుబాయిలో ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో మ్యాచ్ మధ్యలో కెమెరా ముందుకు వచ్చి మరి ఘాటుగా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.. రష్యా చేస్తున్న యుద్ధం చేయవద్దు అంటూ వ్యతిరేకించాడు. నో వారు ప్లీజ్ అంటూ మార్కర్ తో రాసి రష్యా అనుసరిస్తున్న విధానం సరైంది కాదు అంటూ తన వ్యతిరేకత వ్యక్తం చేశాడు. అతను ఇలా మార్కర్ తో రాస్తున్న సమయంలో కామెంటేటర్ గా ఉన్న వ్యక్తి ఇదే విషయాన్ని గట్టిగా మైక్ లో చెప్పడంతో స్టేడియంలో అభిమానులు అందరూ గట్టిగా అరుస్తూ తన నిర్ణయాన్ని చప్పట్లతో స్వాగతించారు. ప్రస్తుతం ఆండ్రి రబ్లేన్ రష్యాకు చెందిన అత్యున్నత శ్రేణి టెన్నిస్ ఆటగాడిగా కొనసాగుతున్నాడు అనే విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: