షాకింగ్ : అపార్ట్మెంట్ పై రష్యా దాడి?
ఈ క్రమంలోనే ఇక ఉక్రెయిన్ రష్యా కు లొంగిపోకుండా వీరోచిత పోరాటం చేస్తూ ఉండటం గమనార్హం.. అయితే మొన్నటి వరకు అండగా ఉంటాము అంటూ చెప్పిన యూరోపియన్ యూనియన్ నాటో దేశాలు పూర్తిస్థాయి మద్దతు ఇస్తూ ఇవ్వకపోవడంతో అగ్ర దేశమైన రష్యాతో ఉక్రెయిన్ ఒంటరిగా పోరాటం చేస్తోంది. అయితే కేవలం ఉక్రెయిన్ సైనిక స్థావరాల మీద మాత్రమే దాడి చేస్తున్నాము అంటూ చెబుతుంది రష్యా. కానీ అటు జనావాసాల్లో కూడా దాడులు చేస్తూ రష్యా మారణహోమం సృష్టిస్తుంది అన్న దానికి దానికి సంబంధించి ఎన్నో ఛాయాచిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయ్. ఎన్నో వీడియోలు అందరి మనసును కదిలిస్తున్నాయి.
ముఖ్యంగా ఉక్రెయిన్ రాజధాని నగరమైన కీవ్ కకావికలం అవుతుంది. జనావాసాల పై దాడులు చేయట్లేదు అంటూ చెప్పిన రష్యా ఇటీవలే ఏకంగా ఒక అపార్ట్ మెంట్ పై దాడి చేయడం సంచలనం గా మారిపోయింది. అందుకు సంబంధించిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. ఒక మిస్సైల్ దాడి చేయడంతో ఒక పెద్ద భవంతి ఒకపక్క పూర్తిగా నాశనం అయిపోయింది. ఇక ఈ భవంతిలో ఎంత మంది ప్రాణాలు కోల్పోయారు అన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు. ఇలా వరుసగా జనావాసాల పై కూడా దాడులకు పాల్పడుతున్న రష్యా ఉక్రెయిన్ విషయంలో కనీస మానవత్వం చూపించడం లేదు అని చెప్పాలి..