ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం.. స్పందించిన ఐరాసా.. ఏమందంటే?
కేవలం ఒక వైపు నుంచి మాత్రమే కాదు అటు మూడు వైపుల నుంచి కూడా రష్యా దళాలు ఉక్రెయిన్ పై దాడికి దిగడంతో ఇక ఉక్రెయిన్ ఉక్కిరిబిక్కిరి అవుతుంది. అర్ధరాత్రి నుంచి ఇక రష్యా ఈ ఆయుధ ప్రయోగాలు జరిపినట్లు తెలుస్తోంది. ఇక ఉక్రెయిన్ రష్యా యుద్ధమే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక ఇప్పటికే మూడు వందలకు పైగా ఉక్రెయిన్ పౌరులు రష్యా చేసిన దాడుల్లో చనిపోయారు అన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఇక ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇటీవల ఐక్యరాజ్యసమితి స్పందించింది.
రష్యా యుద్ధ నేపథ్యంలో ప్రస్తుతం ఉక్రెయిన్ నెలకొన్న పరిస్థితులపై ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేస్తోంది. చిన్న దేశమైన ఉక్రెయిన్ విషయంలో అగ్రదేశం గా కొనసాగుతున్న రష్యా కాస్త మానవత్వం చూపాలని అంటూ ఐరాస చీఫ్ ఆంటోనియా గుటెరస్ కోరారు. ప్రెసిడెంట్ పుతిన్ మానవత్వం చూపి మీ బలాలను వెంటనే వెనక్కి రప్పించండి.. ఘర్షణను ఆపండి అంటూ ఐక్యరాజ్యసమితి చీప్ ఆంటోనియా అన్నారు. అయితే అటు రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం ఎక్కడ తగ్గేది లేదు అన్నట్లుగా దూసుకుపోతున్నాడు.. ఇక ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఎక్కడికి దారితీస్తుంది అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.