ఏ క్షణంలోనైనా చైనా యాక్షన్ షురూ.. యూఎస్ హెచ్చరిక?

praveen
మొన్నటి వరకు చైనా సరిహద్దుల్లో తీవ్ర స్థాయి లో ఉద్రిక్త పరిస్థితులు సృష్టించింది. దక్షిణ చైనా మహా సముద్రం మాదే అంటూ స్టేట్మెంట్ ఇచ్చింది. ఈ క్రమం లోనే అమెరికా జపాన్ ఆస్ట్రేలియా భారత్ దేశాల  క్వాడ్ కూటమి ఏర్పడి దక్షిణ చైనా సముద్రం లో  యుద్ధ విన్యాసాలు చేయడం సంచలనం గా మారి పోయింది. ఇలా ఒక వైపు నుంచి చైనా మరో వైపు నుంచి క్వాడ్ దేశాలు యుద్ధ విన్యాసాలు చేస్తూ ఉండడం తో ఇక ఏ క్షణం లో యుద్ధం జరుగుతుందో అనే విధంగానే మారి పోయింది పరిస్థితి.

 కానీ ఆ తర్వాత మాత్రం పరిస్థితులు కాస్త అదుపు లోకి వచ్చాయి.. ఇక దక్షిణ చైనా సముద్రం మాదే అంటూ స్టేట్మెంట్లు ఇచ్చిన చైనా కాస్త వెనక్కి తగ్గినట్లు కనిపించింది. ఇక అంతలోనే రష్యా ఉక్రెయిన్ వివాదం మొదలైంది. యూరోపియన్ యూనియన్తో కలిసేందుకు సిద్ధమైన ఉక్రెయిన్ ను యుద్ధం చేసి స్వాధీనం చేసుకునేందుకు సిద్ధమైంది రష్యా. ఇదే సమయం లో ఉక్రెయిన్ వెంట అమెరికా యూరోపియన్ యూనియన్ దేశాలు నిలవడం తో ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారి  తీస్తుంది అని అందరూ అనుకున్నారు.

 కానీ ఊహించని రీతిలో రష్యా ఇటీవలే తమ బలగాలను ఉపసంహరించు కుంటున్నట్లు అంటూ ప్రకటించింది. ఇది కాస్త సంచలనం గా మారింది. ఇక ఇప్పుడు పరిస్థితులు సద్దు మణిగాయి అనుకుంటున్న సమయం లో మరో సారి చైనా దక్షిణ చైనా సముద్రంలో యుద్ధ విన్యాసాలు చేసేందుకు సిద్ధమవుతోంది అన్నది తెలుస్తోంది.  వెనక్కి తగ్గాము అంటున్న రష్య మళ్లీ ముందుకు వచ్చి యుద్ధం చేస్తే ఇక ఇదే సమయాన్ని తనకు అనుగుణం గా మార్చుకుని విస్తరణ కాంక్షతో దక్షిణ చైనా సముద్రం, తైవాన్ ను తమ అధీనం  లోకి తెచ్చు కోవడం కోసం చైనా యాక్షన్ మొదలు పెట్టిందని యూఎస్ ఆర్మీ జనరల్ ఇచ్చిన స్టేట్మెంట్లు ఆసక్తికరం గా మారి పోయాయ్..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: