వెనక్కి తగ్గిన రష్యా.. బైడెన్ ఏమన్నారంటే?
అదే సమయంలో ఇక అమెరికా ఇంటిలిజెన్స్ విభాగాలు రష్యా యుద్ధానికి సిద్ధమైందని... రెండు మూడు రోజుల్లో యుద్ధం తప్పదు అంటూ స్టేట్మెంట్ ఇవ్వడం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇకపోతే యుద్ధం జరుగుతుంది అనుకుంటున్న సమయంలో ఇటీవలే రష్యా తమ బలగాలను వెనక్కి రప్పించడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది అని చెప్పాలి. చివరి నిమిషంలో రష్యా తమ దళాలను వెనక్కి రప్పించడం వెనక రప్పించడం వెనుక ఏదైనా ప్లాన్ దాగి ఉందా అని అందరూ చర్చించుకుంటున్నారు. రష్యా ఉక్రెయిన్ మధ్య సరిహద్దు ప్రతిష్టంభన సమసి పోయినట్లే అని మరికొంత మంది అనుకుంటున్నారు.
ఇక ఇటీవల ఇదే విషయం పై అమెరికా అధ్యక్షుడు బైడెన్ స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఉక్రెయిన్ సరిహద్దుల నుంచి రష్యా తమ సైనిక దళాలను ఉపసంహరించుకొన్నప్పటికీ ముప్పు పూర్తిగా తొలగిపోలేదు అంటూ వ్యాఖ్యానించాడు బైడెన్. రష్యా దాడి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆ దేశాన్ని పూర్తిగా నమ్మలేము అంటూ వ్యాఖ్యానించారు. ఇక రాబోయే రోజుల్లో ఉక్రెయిన్ పై రష్యా మళ్లీ దాడి చేయవచ్చు అంటూ పేర్కొన్నాడు బైడెన్. ఏది ఏమైనా ప్రస్తుతం రష్యా అనూహ్యంగా దళాలను వెనక్కి రప్పించడం మాత్రం హాట్ టాపిక్ గా మారిపోయింది.