బాబోయ్.. నేపాల్ లో చైనా కొత్త కుట్ర?
నేపాల్ ప్రధానమంత్రిగా ఉన్న హోలీ శర్మని చెప్పు చేతుల్లో పెట్టుకొని అక్కడ తాము చెప్పిందే వేదం అన్నట్టుగా పాలన సాగించింది చైనా. ఈ క్రమంలోనే ఒకానొక సమయంలో సోదర దేశాలుగా ఉన్న భారత్ నేపాల్ మధ్య యుద్ధం జరుగుతుంది అన్న విధంగా మారిపోయింది పరిస్థితి. ఇక ఇలా భారత్-నేపాల్ సరిహద్దులో నెలకొన్న ప్రతిష్టంభన విషయంలో ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించినా భారత్ ముందడుగు వేసింది. ఈ క్రమంలోనే ఏకంగా నేపాల్ ప్రభుత్వం కూలిపోయి కొత్తప్రభుత్వం వచ్చిన పరిస్థితులు వచ్చాయి.
ఇలాంటి సమయం లో నేపాల్ లో మళ్లీ తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ఉద్రిక్త పరిస్థితులు సృష్టించేందుకు చైనా కొత్త ప్లాన్ వేసింది అని అర్థమవుతుంది. మొన్నటి ఆర్థిక సంక్షోభం లో కూరుకు పోయిన నేపాల్కు చైనా మొండి చెయ్యి చూపుతే అగ్రరాజ్యమైన అమెరికా మాత్రం 5 ట్రీలియన్ డాలర్లు ఆర్థిక సహాయం చేసింది. అయితే ఇదే విషయాన్ని తప్పు బడుతూ నేపాల్లో చైనా చెప్పుచేతల్లో ఉన్న వామ పక్ష నేతలు ప్రస్తుతం ఉద్యమాలు చేపడుతున్నారు. అమెరికా నుంచి నేపాల్ అప్పు తీసుకోవడం తప్పు అంటూ విపక్షాలు చెబుతున్నాయట. చైనా నుంచి ఆర్థిక సహాయం తీసుకోవడంలో తప్పు లేదని అంటున్నారట. ఇదంతా చైనా కొత్త కుట్రలో భాగంగానే జరుగుతుందని అంచనా వేస్తున్నారు నిపుణులు.