ఉక్రెయిన్ కోసం.. ఏకే - 47 చేతపట్టిన 79 ఏళ్ళ బామ్మా?

praveen
ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ సరిహద్దుల్లో ప్రతిష్టంభన ఏ రేంజ్ లో కొనసాగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఉక్రెయిన్ ను తమ ఆధీనంలోకి తెచ్చుకుంటా మంటూ రష్యా యుద్ధానికి సిద్ధం అవుతోంది. ఇలాంటి సమయంలోనే తాము స్వతంత్ర దేశంగా ఉండడానికి మాత్రమే సిద్ధంగా ఉన్నామని.. రష్య చెప్పుచేతుల్లో బానిస బ్రతుకులు బ్రతికేందుకు తమ దేశ పౌరులు కూడా సిద్ధంగా లేరని.. ఏకంగా రష్యాతో యుద్ధం వస్తే దేశ పౌరులు అందరూ ఆయుధాలు పట్టుకుని పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారంటూ ఉక్రెయిన్ స్టేట్మెంట్ ఇస్తోంది. ఉక్రెయిన్  మద్దతుగా దేశ పౌరులందరూ సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.


 నేను మీ లాగా దృఢంగా ఉండకపోవచ్చు.. బరువైన ఆయుధాలు మోసే సత్తా నా దగ్గర లేకపోవచ్చు.. కానీ నా దేశం ప్రమాదంలో ఉన్నప్పుడు ప్రాణాలకు తెగించి అయినా పోరాడేందుకు నేను సిద్ధంగా ఉన్నాను అంటూ చెబుతుంది ఉక్రెయిన్ కు చెందిన 79 ఏళ్ల బామ్మ వాలెంటినా. ఎంతో పౌరుషం గా చెప్పిన మాటలు ప్రస్తుతం అందరి రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తున్నాయి. 79 ఏళ్ల బామ్మే కాదు  నాలుగేళ్ల చిన్నారి సైతం ఏకే 47 చేతిలో పట్టుకొని రష్యా తో పోరాటానికి మేము కూడా దేశం కోసం సిద్ధంగా ఉన్నామంటూ చెబుతున్నారు. ఇలా రష్యా ఆక్రమణల నుంచి దేశాన్ని రక్షించడం కోసం అక్కడ చిన్నాపెద్ద అంతా కలిసి దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నాం అంటూ కదం తొక్కుతున్నారు.



 చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తుపాకుల శిక్షణ తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తూర్పు ఉక్రెయిన్ లో 79 ఏళ్ల వాలెంటినా తుపాకుల శిక్షణలో  పాల్గొని ఏకే 47 తుపాకీని పట్టుకుని శిక్షణ తీసుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయ్. అయితే వయస్సును లెక్కచేయకుండా దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధమైన 79 ఏళ్ల బామ్మకు ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లు అభినందిస్తున్నారు. కేవలం ఒక్క వాలెంటినా మాత్రమే కాదు ఎంతో మంది వృద్ధులు యువత చిన్న పిల్లలు సైతం ముందుకు వస్తూ రష్యాతో యుద్ధం జరిగితే దేనికైనా నేను సిద్ధంగా ఉన్నాం అంటూ చెబుతూ ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: