మాకు అలాంటి ఆలోచనే లేదు.. ఉక్రెయిన్ కి షాకిచ్చిన నాటో?

praveen
రష్యా ఉక్రెయిన్ సరిహద్దులో నెలకొన్న పరిస్థితులు రోజురోజుకు హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి. యూరోపియన్ యూనియన్ దేశాలతో చేరేందుకు ఉక్రెయిన్ సిద్ధమవుతున్న నేపథ్యంలో అలాంటిది సహించేది లేదు అంటూ రష్యా హెచ్చరికలు జారీ చేస్తుంది. ఒకవేళ ఉక్రెయిన్ యురోపియన్ యూనియన్ లో చేరాలని అనుకుంటే తాము యుద్ధం చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నాము అంటూ హెచ్చరికలు కూడా జారీ చేస్తూ ఉండటం గమనార్హం. ఈ క్రమంలో ఇప్పటికే సరిహద్దుల్లో లక్షల మంది సైనికులను మోహరించిన రష్యా భారీ ఆయుధాలను కూడా మొహరిస్తూ యుద్ధానికి సన్నద్ధం అవుతున్నట్లు గానే వ్యవహరిస్తుంది.



 ఏ క్షణంలో రష్యా ఉక్రెయిన్ పై ఎటాక్ చేస్తుంది అన్నది కూడా ఊహకందని  విధంగానే ఉంది అన్నది తెలుస్తుంది. ఇలాంటి సమయంలో అటు యూరోపియన్ యూనియన్ దేశాలు, నాటో దేశాలు కూడా ఉక్రెయిన్ కి మద్దతు ప్రకటిస్తున్నాము అంటూ తెలిపారు. ఈ క్రమంలోనే ఇక ఉక్రెయిన్ కు మద్దతుగా ఏకంగా రష్యాతో యూరోపియన్ యూనియన్, నాటో దేశాలు యుద్ధానికి దిగుతాయని గత కొన్ని రోజుల నుంచి చర్చ జరుగుతూనే ఉంది. కానీ వరుసగా ఆయా దేశాలు ఉక్రెయిన్ కు షాక్ ఇస్తున్నాయి అన్నది తెలుస్తోంది.


 ఇప్పటికే యూరోపియన్ యూనియన్ లోని కొన్ని సభ్య దేశాలు ఉక్రెయిన్ కి  మద్దతుగా కొన్ని మినీ టీంలను పంపిస్తాము అంటూ నామమాత్రపు మద్దతు ప్రకటించాయి. ఇక ఇప్పుడు నాటో దేశాలు కూడా ఇదే చెబుతున్నాయి. ఉక్రెయిన్  కు బలగాలు పంపే యోచన లేదు అంటూ నాటో స్పష్టం చేసింది. నాటో బలగాలు ఉక్రెయిన్ కు మద్దతుగా రంగంలోకి దిగుతాయి అనుకుంటున్న సమయంలో తమకు అలాంటి ఆలోచన లేదు అంటున నాటో  క్లారిటీ ఇచ్చింది. కానీ మద్దతు పలుకుతామని అంటూ నాటో జనరల్ సెక్రెటరీ వ్యాఖ్యానించడం గమనార్హం. సరిహద్దుల్లో  యుద్ధ మేఘాలు కమ్ముకొస్తున్న సమయంలో మద్దతు ఇస్తామంటూ చెప్పిన యూరోపియన్ యూనియన్ నాటో దేశాలు షాక్ ఇస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: