పాపం.. తాలిబన్ల డబ్బులు పోయాయి?

praveen
ఆయుధాలను చేతపట్టి ఆఫ్ఘనిస్తాన్ పై ఆదిపత్యాన్ని సాధించిన తాలిబన్లకు అడుగడుగునాఎన్నో అవాంతరాలు ఎదురవుతున్నాయి. ప్రజాస్వామ్యం పాలనను మంటగలిపి ఇస్లామిక్ చట్టాలను అమలు లోకి తీసుకు వచ్చిన తాలిబన్లు ప్రస్తుతం అరాచక పాలన సాగిస్తున్నారు అని చెప్పాలి. తాము చెప్పిందే వేదం అన్న విధంగా ప్రజలను బానిసలుగా మార్చుకుంటూ దారుణం గా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా మహిళల విషయంలో తాలిబన్లు వ్యవహరిస్తున్న తీరు రోజురోజుకు హాట్ టాపిక్ గా మారి పోతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

 ఇలా తాలిబన్ల అరాచకాలు రోజురోజుకీ ప్రపంచదేశాలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. అయితే తాలిబన్ల ఆధిపత్యం లోకి వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత అటు ప్రపంచ దేశాలు తాలిబన్లతో సంబంధాలను పూర్తిగా తెరుచుకున్నాయి. దీంతో ఇక ఆఫ్ఘనిస్తాన్ మొత్తం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోంది అన్న విషయం తెలిసిందే. ఎటువైపు నుంచి ఆదాయం లేక పోవడంతో తాలిబన్లు ప్రభుత్వం ఆర్థిక సమస్యల వలయంలో చిక్కుకు పోతుందని. ఇలా ఇప్పటికే ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న సమయంలో ఇక ఇప్పుడు తాలిబన్ల ప్రభుత్వానికి ఊహించని షాక్ తగిలింది.

 తాలిబన్లు రాకముందు ఆఫ్ఘనిస్థాన్లో ప్రజాస్వామ్య పాలన కొనసాగుతున్న సమయంలో అధ్యక్షుడిగా ఉన్న ఘని తజకిస్తాన్ లో ఒక పాఠశాల నిర్మాణానికి సంబంధించి నిధులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇక మొదటి విడతలో భాగంగా 8 మిలియన్ డాలర్లను గతంలో ఆప్ఘనిస్తాన్ ప్రభుత్వం  తజకిస్తాన్ ప్రభుత్వానికి సహాయం చేసింది. రెండో విడతలో భాగంగా నాలుగు లక్షల డాలర్లు పంపాల్సి ఉంది. ఈ క్రమంలోనే అప్పట్లోనే ప్రభుత్వం దీనికి సంబంధించిన పంపాల్సిన సమయం సెట్ చేసి  పెట్టడంతో ఇక ఇప్పుడు తాలిబన్ల అనుమతి లేకుండా ఈ డబ్బు మొత్తం తజికిస్తాన్ కు వెళ్ళిపోయింది. దీంతో తమ ప్రభుత్వం ఖాతాలో డబ్బులు ఉన్నాయి ఖర్చు పెట్టుకోవచ్చు అని ఆనంద పడిన తాలిబన్లకు ఇక ఈ ఘటన షాకిచ్చింది అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: