పాక్ ఆర్థిక సంక్షోభం: ఇమ్రాన్ గిఫ్ట్ ను కూడా అమ్ముకున్నాడా?

Dabbeda Mohan Babu
పాకిస్థాన్ దేశ‌లో ఆర్థిక సంక్షోభం రోజు రోజు కు ముదిరి పోతుంది. ఇప్పటికే చాలా దేశాల నుంచి విప‌రీతంగా అప్పులు తెచ్చుకుని త‌మ దేశాన్ని న‌డిపిస్తున్నారు. అలాగే ఆ అప్పుల‌కు వ‌డ్డీ లు క‌ట్ట‌డానికి కూడా కొత్త‌గా అప్ప‌లు తీసుకు వ‌చ్చే దారుణ ప‌రిస్థితి పాకిస్థాన్ లో నెల‌కొంది. ఇమ్రాన్ ఖాన్ పాల‌న పై ఆ దేశ రాజ‌కీయ నాయకులు, ప్ర‌జ‌లు ద‌మ్ము ఎత్తి పోస్తున్నారు. అలాగే ఇటీవ‌ల ప్ర‌పంచ బ్యాంక్ రిపొర్ట్ కూడా పాకిస్థాన్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ పాల‌న విధానాల‌ను ఎత్తి చూపిన‌ట్టు వ‌చ్చాయి. ప్ర‌పంచంలో విదేశి అప్పులు ఎక్కువ గా ఉన్న టాప్ పది దేశాలలో పాకిస్థ‌న్ కూడా చేరి పోయింద‌ని ప్ర‌పంచ బ్యాంక్ ఇటీవ‌ల ప్ర‌క‌టించింది.

దీంతో ఇమ్రాన్ ఆస‌మ‌ర్థ పాల‌న మ‌రో సారి బ‌య‌ట ప‌డింద‌ని పాక్ ప్ర‌తిప‌క్ష‌లు అంటున్నారు. అయితే గ‌త కొద్ది రోజుల నుంచి పాకిస్థాన్ లో ఉన్న విలు వైన వ‌స్తువ‌ల‌ను అమ్మి అప్పులు క‌ట్ట‌డం, ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌కు వెచ్చించ‌డం జ‌రుగుతుంది. అయితే తాజాగా ఆ దేశ ప్ర‌ధాని మ‌రో సారి కొన్ని బ‌హుమ‌తులు అమ్మాడ‌ని పాకిస్థాన్ ముస్లిం లీగ్ , పాకిస్థాన్ డెమోక్ర‌టిక్ మూవ్ మెంట్ పార్టీ ల నాయకులు అంటున్నారు. అయితే అలా అమ్మ‌డం వ‌ల్ల వ‌చ్చిన డ‌బ్బు ను ప్ర‌భుత్వం కోసం కాకుండా త‌న సొంత ఖాత లో వేసుకున్నాడ‌ని వీరు ఆరోపిస్తున్నారు. అయితే గ‌తంలో ఒక గ‌ల్ఫ్ దేశ యువ‌రాజ్ పాకిస్థాన్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ కు ఒక ఖ‌రీధైన గ‌డియారం బ‌హుమ‌తి గా ఇచ్చాడు.

అయితే దాన్నిఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ దుబాయ్ లో రూ. 7.4 కోట్ల కు అమ్మి త‌న సొంత అకౌంట్ వేసు కున్నార‌ని ఆరోపిస్తున్నారు. అయితే గిఫ్ట్ ల ద్వారా త‌క్క‌వ మొత్తం లో ఆదాయం వ‌స్తే వారే ఉప‌యోగించు కోవ‌చ్చు కానీ ఇంత పెద్ద మొత్తంలో ఆదాయం వ‌చ్చిన స‌మ‌యంలో ప్ర‌భుత్వాని ఇవ్వాల‌ని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే పాక్ లో ప్ర‌స్తుతం ఉన్న ఆర్థిక సంక్షోభం వ‌ల్ల తీవ్ర స‌మ‌స్య‌లను ఎదుర్కొంటుంది. అలాగే ప్ర‌స్తుతం ఏ ఇత‌ర దేశాలు కూడా అప్పులు  ఇవ్వ‌డానికి సిద్ధంగా లేవు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: