విదేశాలకు వెళుతున్నారా మీకో శుభవార్త... ఇకపై?

VAMSI
గత రెండు సంవత్సరాలకు పైగా కంటికి కనిపించని ఒక వైరస్ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది. ఈ కరోనా వైరస్ వచ్చిన తర్వాత నుండి విదేశాలకు వెళ్లే వారికి కష్టాలు మొదలు అయ్యాయి. విమానయాన సంస్థలు మరియు ఇమ్మిగ్రేషన్ ఆఫీసులలో రోజు రోజుకి వివిధ రకాల నియమ నిబంధనలను తీసుకు వస్తుండడం వలన తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అందులో ఒక రూల్ ఏమిటంటే, విదేశాలకు వెళ్లాలంటే ఖచ్చితంగా రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకుని ఉండాలి మరియు వ్యాక్సిన్ సర్టిఫికెట్ ఉండాలి. అయితే కొన్ని కారణాల వలన ఎంతో మంది ఇంకా కూడా వ్యాక్సిన్ వేయించుకోకపోగా ఒకవేళ వేసుకున్నా చాలా మంది సర్టిఫికెట్ పొందలేదు. అయితే ఈ విధమైన సమస్యలతో బాధపడుతున్న వారికి కోవిన్ యాప్ ఒక శుభవార్తను తెలియచేసింది.
ఈ యాప్ మనకు వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకునే సమయం నుండి తిరిగి వ్యాక్సిన్ సర్టిఫికెట్ పొందే వరకు అన్ని విషయాలలో మనకు సహాయపడనుంది. వ్యాక్సిన్ వేసే సమయంలోనే మన పూర్తి వివరాలు అందులో పొందుపరచబడుతాయి. రెండు డోసులు అయిపోయాక అదే యాప్ నుండి మనం వ్యాక్సిన్ సర్టిఫికెట్ ను పొందవచ్చు. ఇప్పుడు ఈ యాప్ లో మరొక్క కొత్త ఫీచర్ ను తీసుకువచ్చి ఫారిన్ వెళ్లే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. ఇంతకు ముందు వరకు అయితే కోవిన్ యాప్ లో కేవలం మీ పేరు, చిరునామా, గుర్తింపు కార్డు వివరాలు లాంటివి మాత్రమే నమోదు చేసేవారు. కానీ ఇప్పుడు మీరు పుట్టినతేదీని కూడా నమోదు చేయనున్నారు .
ఇది సర్టిఫికెట్ లో రావడం వలన మీరు విదేశాలకు వెళ్లే సమయంలో ఉపయోగపడనుంది. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఇకపై కోవిన్ యాప్ లో ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం ఈ రోజు నుండి ఎవరైతే విదేశాలకు వెళుతున్నారో వారంతా కూడా కొత్త వెర్షన్ కోవిన్ యాప్ నుండి మాత్రమే కోవిడ్ సర్టిఫికెట్ ను డౌన్లోడ్ చేసుకోవాలని తెలిపింది.  దీనిని స్వయంగా నేషనల్ హెల్త్ అథారిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మరియు చైర్మన్ ఆర్ ఎస్ శర్మ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇది ఎంతోమందికి ఉపయోగం కానుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి:

NRI

సంబంధిత వార్తలు: