ఆడవుల పెంపకానికి అమెరికా సాయం !

Vennelakanti Sreedhar
ఆడవుల  పెంపకానికి అమెరికా సాయం  !
భారత్ లో అడవుల పెంపకానికి  అగ్ర రాజ్యమైన అమెరికా సాయమా ? ఆశ్చర్యపోకండి. ఇది నిజం. భారత్ లోని పలు రాష్ట్రాలలో అడవుల పెంపకానికి యు.ఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్ మెంట్  ( యు.ఎస్. ఎయిడ్ మిషన్) సాయం అందించ నుంది. ఇప్పటి వరకూ బీహార్, కేరళకు మాత్రమే పరిమిత మైన ఈ కార్యక్రమం ఇక తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ కు కూడా విస్తరిరంచ నుంది. ఈ విషయాన్ని ఆ సంస్థ ప్రతినిధి వీణా రెడ్డి ప్రకటించారు.  భారత్ లో పర్యటిస్తున్న ఆమె  హైదరాబాద్ లోని అరణ్య భవన్ లో అధికారులతో సమావేశమయ్యారు. యు.ఎస్. ఎయిడ్ మిషన్ చేపడుతున్న"ఫారెెస్టా  ప్లస్" కార్యక్రమం గురించి వివరించారు. తెలంగాణలో హరిత వనాల పెంపకం చాలా బాగా జరుగుతోందని కితాబిచ్చారు. దేశంలో ని పలు జిల్లాలలో  ఫారెస్ట ప్లస్ కార్యక్రమం నిర్వహించ నున్నట్లు తెలిపారు. మానవులంతా  సవాళ్లను ఎదుర్కొంటుంటారని చెబుతూ,  పర్యావరణంలో నిత్యం జరుగుతున్న మార్పులను ఎదుర్కోవడమే పెద్ద సవాల్ అని పేర్కొన్నారు. ప్రతిక్షణం భౌగోళికంగా జరుగుతున్న మార్పులను ఎదుర్కొవాలంటే  స్థానికులను భాగస్వామ్యం చేయాల్సిన  అవసరం ఎంతైనా ఉందన్నారు. యు.ఎస్. ఎయిడ్ మిషన్ స్థానికుల సహయ సహకారాలతో పర్యావరణాన్ని పరిరక్షించేందుకు కృషి చేస్తుందని వివరించారు. అమెరికాలో చేపట్టిన పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను పవర్ పాయింటి్ప్రజెంటేషన్ ద్వారా ఆమె అధికారులకు వివరించారు. సమావేశానికి హాజరైన  తెలంగాణ ప్రభుత్వ అటవీ సంరక్షణ అధికారి జైస్వాల్ వివిధ జిల్లాలలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యలను వివరించారు. తెలుగు రాష్ట్రాలలో అడవులు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని  వీణా రెడ్డి పేర్కొంటూ క్షేత్ర స్థాయి పరిశీలన నిమిత్తం అమెరికాలో పర్యటించాలని ఆమె అధికారులను కోరారు. అధికారులు క్షేత్రస్థాాయిలో పర్యటనలు జరిపితే మరిన్ని విషయాలు అవగత మవుతాయని అన్నారు. హైదరాబాద్ లో తొలి ట్రాన్స్ జెండర్ క్లినిక్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.  గాాలిలోని తేమను నీరుగా మార్చేయంత్రం  (వాటర్ ఫ్రం ఎయిర్ కియేస్క్ ) అద్భుతమైందన్నారు.  దీనిని విశాఖ పట్టణంలో ఏర్పాటు చేయడం చాలా సంతోషించ తగ్గ అంశమన్నారు. రెండు సంవత్సరాలుగా ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి పథంలో చాలా వేేగంగా వెళుతోందని వీణా రెడ్డి తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: